ఈ బుట్ట బొమ్మ..మరో బాపు బొమ్మ?

Butta Bomma song will become another Bapu Bomma?
Monday, December 16, 2019 - 15:30

'అలవైకుంఠపురంలో' ఇప్పటికే మూడు పాటలు వచ్చాయి. నాలుగో పాటగా 'బుట్ట బొమ్మ' అనే సాంగ్ విడుదల కానుంది. ఈ నెల 18న ..లిరికల్ వీడియోని రిలీజ్ చేస్తారు. తమన్ స్వరపరిచిన ఈ పాట లిరిక్ వింటే... త్రివిక్రమ్ తీసిన 'అత్తారింటికి దారేది' సినిమాలోని "బాపు బొమ్మ" సాంగ్ గుర్తొస్తోంది. ఆ సినిమాలో ఆ సాంగ్ చాలా పాపులర్. ఆ సాంగ్ లో నటించిన ప్రణీతకి 'బాపు బొమ్మ' అన్న పేరు స్థిరపడింది. 

ఇప్పుడు ఈ  బుట్ట బొమ్మకూడా అలానే పాపులర్ అవుతుందా? పూజ హెగ్డే కి ఆ పేరు అటాచు అవుతుందా? అనేది చూడాలి. పూజకి ఇప్పుడు క్రేజ్ మామూలుగా లేదు. ఆమెకి ఈ సాంగ్ తో పర్టికులర్ ఇమేజ్ అవసరం లేదు.

ఈ బుట్ట బొమ్మ..బాపు బొమ్మ సౌండింగ్ తో మాత్రమే కాదు... టీజర్ లో కొన్ని స్కీన్లతో ...ఈ సినిమా ...అత్తారింటికి దారేది మీటర్ ని ఫాలో అయింది అనిపిస్తోంది. నిజంగా అదే జరిగితే ..సినిమా బ్లాక్ బస్టరే. ఇప్పటికే సాంగ్స్ తో సినిమా పై అంచనాలు ఆకాశాన్నంటాయి