డ్రగ్స్ కేసులో మిస్సయిన సెలిబ్రిటీలు

Celebrities missing from chargesheet of Drugs Case
Tuesday, May 14, 2019 - 18:45

రెండేళ్ల క్రితం సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసుని ఇపుడు అందరూ మరిచిపోయారు. ఐతే ఆ కేసు మాత్రం పూర్తిగా తెరమరుగు అవలేదు. కోర్టులో నడుస్తూనే ఉంది.

తాజాగా నాలుగు చార్జ్ షీటులు ఫైల్ చేశారు తెలంగాణ ఎక్సయిజ్ అధికారులు. ఇందులో డ్రగ్స్ తీసుకున్న పలువురు పేర్లతో పాటు డీలర్స్ పేర్లు కూడా ఉన్నాయి. విచిత్రంగా ఒక్క టాలీవుడ్ సెలబ్రిటీ పేరు లేదు.

రవితేజ, చార్మి, పూరి జగన్నాథ్, శ్యాం కే నాయుడు, తరుణ్, సుబ్బరాజు, ముమైత్ ఖాన్, తనీష్, నందు, నవదీప్, చిన్నా ...ఇలా పలువురు సెలబ్రిటీలను విచారించారు ఇంతకుముందు. కానీ తాజాగా చార్జిషీట్లలో వీరి పేర్లు మిస్ అయ్యా యని ఒక సంస్థ ఆరోపిస్తోంది. సెలబ్రిటీలను ఎందుకు మిస్ కొట్టారని అడుగుతోంది ఆ సంస్థ.