అలీకి వెల్క‌మ్ చెప్పిన చంద్ర‌బాబు

Chandrababu Naidu invites Ali to politics
Saturday, February 23, 2019 - 23:00

క‌మెడియ‌న్ అలీ 40 ఏళ్ల సినిమా కెరియ‌ర్‌ని పూర్తి చేసుకున్నాడు. ఇక ఇపుడు అత‌ని దృష్టి రాజ‌కీయాల‌పై ప‌డింది. ఎమ్మెల్యేగా బ‌రిలోకి దిగాల‌ని మొద‌ట వైఎస్సార్సీ పార్టీని సంప్ర‌తించాడు. అంత‌కుముందు జ‌న‌సేన‌లో ఉన్నాడు. చివ‌రికి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రెడీ అయ్యాడు. అందుకే త‌న 40 ఏళ్ల కెరియ‌ర్ కార్య‌క్ర‌మానికి ఏపీ సీఎం చంద్ర‌బాబుని ముఖ్య అతిథిగా ఆహ్వానించాడు. 

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అలీకి సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన ఏపీ సీఎం.. అలీ రాజకీయాల్లోకి రావాలని కోరారు. ఇన్‌డైర‌క్ట్‌గా ఆయ‌న పార్టీలోకి అడుగుపెడితే సీట్ ఇస్తామ‌ని చెప్పారు.  ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ తర్వాతే చాలా మంది నటనను కెరీర్‌గా ఎంచుకున్నారు. అన్ని తరాల నటులకు అలీ స్ఫూర్తిగా నిలుస్తారని అభినందించారు చంద్ర‌బాబు.

అలీ రాజ‌మండ్రి నుంచి ఎమ్మెల్యేగా బ‌రిలోకి దిగాల‌ని కోరుకుంటున్నాడు. మ‌రి టీడీపీ ఆయ‌న‌కి అదే సీట్ ఇస్తుందా? లేక మ‌రేదైనా నియోజ‌క వ‌ర్గం కేటాయిస్తుందా అనేది చూడాలి.