ఛార్మికి మళ్ళీ ట్రోలింగ్ మొదలు

Charmee gets trolled, corona effect
Tuesday, March 17, 2020 - 14:00

కరోనా కారణంగా పూరి కనెక్ట్స్ ఆఫీస్ కు తాళాలు వేశారు. నెక్ట్స్ షెడ్యూల్ ను నిరవధికంగా వాయిదా వేశారు. అందర్నీ ఇళ్లకు పంపించేశారు. అన్ని సినిమాల షూటింగ్స్ బంద్ అయ్యాయి. ఛార్మి నిర్మిస్తున్న సినిమా బంద్ కావడంలో వింతేమీ లేదు. కానీ మిగతా ఎవరిని ట్రోల్ చెయ్యడం లేదు ఛార్మిని మాత్రం వదలడం లేదు. 

ఇప్పుడు చార్మిని ట్యాగ్ చేస్తూ టీజ్ చేస్తున్నారు. ఇప్పుడు నీకు ఆనందంగా ఉందా చార్మి అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ చార్మిని ఇలా ట్రోల్ చేయడానికి కారణమేంటో తెలుసా..

ఇండియాలో మొట్టమొదటి కరోనా పాజిటివ్ కేసు బయటపడిన వెంటనే ఆనందం వ్యక్తంచేసింది చార్మి. ఆ టైమ్ లో ముంబయిలో ఉన్న ఈమె, కంగ్రాట్స్ గాయ్స్.. ఫైనల్లీ కరోనా వచ్చేసింది. ఆల్ ది బెస్ట్ టు ఆల్.. అంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది. దీంతో అంతా ఆమెను తగులుకున్నారు. ఇండియాకు కరోనా వస్తే నీకు అంత ఆనందం ఏంటంటూ విరుచుకుపడ్డారు. దీంతో వీడియో పెట్టిన కొన్ని గంటలకే దాన్ని డిలీట్ చేసింది చార్మి.

కట్ చేస్తే, ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ విజయ్ దేవరకొండ సినిమాపై కూడా పడింది. ఏకంగా పూరి కనెక్ట్స్ ఆఫీస్ క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విషయాన్ని తెలుపుతూ ఓ నోట్ రిలీజ్ చేసింది చార్మి. దీంతో అంతా ఇప్పుడు మరోసారి చార్మిని టార్గెట్ చేశారు. కరోనా వచ్చింది కదా.. ఇప్పుడు నీకు ఆనందంగా ఉందా అంటూ గతంలో చార్మి డిలీట్ చేసిన వీడియోని మళ్లీ ఆమెకే ట్యాగ్ చేసి పోస్ట్ చేయడం స్టార్ట్ చేశారు.