ఛార్మి బాగా తగ్గింది కదా

Charmee slims down
Saturday, December 28, 2019 - 15:45

ఛార్మి హీరోయిన్ వేషాలు వేయడం లేదు. ఇప్పుడు ఆమె రోల్ నిర్మాణం వరకే. నిర్మాతగా, దర్శకుడు పూరి వ్యవహారాలు చూస్తూ బిజిగా మారింది చార్మి. ఐతే.. ఇప్పుడు సడెన్ గా సన్నబడడంతో మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. హీరోయిన్ గా మళ్ళీ వేషాలకోసం ప్రయత్నిస్తోందా అన్న డౌట్స్ వస్తున్నాయి. ఐతే అలాంటిదేమి లేదంటోంది ఛార్మి. 

ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ కావడంతో... మళ్ళీ తన ఫిట్నెస్ పై శ్రద్ధ పెట్టింది. ఇప్పుడు చేతిలో మనీ కళకళలాడుతోంది. అందుకే కష్టపడి... సన్నబడింది. 

విజయ్ దేవరకొండ హీరోగా పూరి తీసే కొత్త మూవీ 'ఫైటర్'... నిర్మాణ బాధ్యతలన్నీ కూడా ఆమే చూసుకోనుంది. జనవరి 13 నుంచి ఈ సినిమా షూటింగ్ ముంబైలో మొదలు కానుంది. 80 శాతం సినిమా షూటింగ్ ముంబై లోనే.