మ‌న్మ‌ధుడుతో చిన్మ‌యికి చిక్కులు

Chinmayi gets trolled over Manmadhudu 2
Friday, June 14, 2019 - 15:30

గాయ‌ని చిన్మ‌యి ..మ‌హిళల అంశాల‌కి సంబంధించి బాగా వాదిస్తుంది. మీటూ ఉద్య‌మంతో ద‌క్షిణాది చిత్ర ప‌రిశ్ర‌మ‌లో పెద్ద క‌ల‌కలమే రేపింది. అలాగే సినిమా హీరోల మేల్ఇజంపై కూడా ఘాటుగానే స్పందిస్తుంటుంది. ఆ మ‌ధ్య మ‌న హీరోలు చాలా చిన్న వ‌య‌సు భామ‌ల‌తో జ‌త‌క‌ట్ట‌డంపై కామెంట్ చేసింది. ఇప్ప‌టికీ వ‌య‌సు మ‌ళ్లిన స్టార్స్ త‌మ కూతురు వ‌య‌సు అంత ఉండే హీరోయిన్ల‌తో జ‌త‌క‌డుతున్నారు. త‌రాలు మారినా, ద‌శాబ్దాలు మారినా ట్రెండ్ మార‌ట్లేదు క‌దా అని విమ‌ర్శించింది. 

విచిత్రం ఏమిటంటే ..ఆమె అన్ని కామెంట్లు చేసినా... ఆమె భ‌ర్తే ఆమె మాట విన‌లేదు. ఆమె భ‌ర్త రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన మ‌న్మ‌ధుడు 2 సినిమాలో నాగార్జున హీరో. నాగార్జున‌కి అక్ష‌రాలా 60 ఏళ్లు. ఈ ఏజ్‌లో ఆయ‌న్ని మ‌న్మ‌ధుడిగా చూపిస్తున్నాడు రాహుల్ ర‌వీంద్ర‌న్‌. ఇక ఈ సినిమా టీజ‌ర్ చూస్తే...అందులో నాగార్జున కుర్ర‌భామ‌ల‌తో లిప్పుల‌తో కిస్సులు జుర్రుకున్నాడు. అక్ష‌ర‌గౌడ‌, ర‌కుల్ ప్రీతి సింగ్ వంటి 30 ఏళ్లలోపు భామ‌లు నాగ్ స‌ర‌స‌న న‌టించారు. మ‌రి ఈ విష‌యంలో మాత్రం మౌనం వహిస్తోంది. దాంతో సోష‌ల్ మీడియాలో ట్రాలింగ్ మొద‌లైంది. 

కాక‌పోతే... ఆమె స‌మాధానం చెప్పడానికి ఒక మంచి రీజ‌న్ ఉంది. క‌థ‌లో కూడా హీరో బాగా వ‌య‌సు అయిపోయిన వాడు. వ‌య‌సు ముదిరిన కూడా పెళ్లి కాకుండా ఉన్న వ్య‌క్తి...కొన్ని కార‌ణాల వ‌ల్ల యువ భామ‌ల‌తో డేటింగ్ చేయాల్సి వ‌స్తుంది. అలా క‌థ ప్ర‌కార‌మే ఇలా చిన్న వ‌య‌సున్న భామ‌ల‌ను తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని ఆమె క్లారిఫికేష‌న్ ఇచ్చుకోవ‌చ్చు. కానీ ఆమె మౌనం వ‌హిస్తోంది ఎందుకో