నేను చీర‌క‌డితే వాళ్లు అలా చేస్తున్నారు!

Chinmayi: If I wear Sari, they upload onto porn websites
Tuesday, January 29, 2019 - 13:30

ద‌క్షిణాదిన మీటూ ఉద్య‌మాన్ని స‌మ‌ర్ధ‌వంతంగా న‌డిపిన సెల‌బ్రిటీల‌లో ఒక‌రు చిన్మయి. సింగ‌ర్ చిన్మ‌యికి సోష‌ల్ మీడియాలో ఫాలోయింగ్ ఆమె పాట‌ల క‌న్నా ఆమె వివిధ స‌మ‌స్య‌ల‌పై స్పందించే విధానం వ‌ల్లే వ‌చ్చిందంటే అతిశ‌యోక్తి కాదు. ఆమె పాట‌ల గురించి సోష‌ల్ మీడియాలో త‌క్కువ డిస్క‌ష‌న్ ఉంటుంది. ఆమె చేసే కామెంట్స్‌, ట్వీట్స్‌పై ఎక్కువ ర‌గ‌డ ఉంటుంది. అలాగ‌ని ఆమె పాట‌ల‌ను త‌క్కువ అంచ‌నా వేయొద్దు. ఆమె అద్భుత‌మైన గాయ‌ని.

ఐతే ఆమెని కొంద‌రు కావాల‌ని ప‌దే ప‌దే ట్రోలింగ్ చేస్తుంటారు. అలాగే కొంద‌రి ఆమెకి అస‌భ్య‌క‌ర‌మైన మెసేజ్‌లు, ఫోటోలు పంపుతుంటార‌ట‌. అందుకే తాను చీర కట్టుకోనంటోంది. ఇంత‌కీ చీర‌కి, దీనికి ఏంటి సంబంధం?

మీరు అద్భుతంగా పాడుతారు. స్టేజ్‌పై ప్ర‌ద‌ర్శ‌న‌లిచ్చేట‌ప్పుడైనా చీర క‌ట్టుకోవ‌చ్చు క‌దా. దాని వ‌ల్ల యంగ్ అమ్మాయిల‌కి ఒక స్ఫూర్తినింపిన వారవుతారు అని ఒక అభిమాని అడిగిన ప్ర‌శ్న‌కి ఆమె స‌మాధానం ఇచ్చింది. తాను చీర క‌ట్టుకున్న‌ప్పుడు ర‌క‌ర‌కాల యాంగిల్స్‌లో ఫోటోలు తీసి ఆక‌తాయి కుర్రాళ్లు నెట్‌లో అప్‌లోడ్ చేస్తున్నార‌ట‌.

"నేను చీర క‌ట్టుకున్న‌ప్పుడు కొంత మంది మ‌గాళ్లు ...నా న‌డుం భాగాన్ని ఫోటో తీసి, నా ఎద భాగాన్ని ఎక్స్‌పోజ్ చేస్తూ, ఆ ఫోటోల‌పై స‌ర్కిల్ గీస్తూ వాటిని సాఫ్ట్ పోర్న్ సైట్లోకి అప్ లోడ్ చేస్తున్నారు. అంతేకాదు వాటిని తాము ఎలా హ‌స్త‌ప్ర‌యోగం  చేసుకున్నమో తెలుపుతూ మ‌రికొంద‌రు మెసేజ్‌లు పంపుతుంటార‌ని," సుదీర్ఘంగా వివ‌ర‌ణ ఇచ్చింది చిన్మ‌యి.