20 ఏళ్ల తర్వాత చిరు, విజయశాంతి కాంబో!

Chiranjeevi and Vijayshanthi to share same dias
Saturday, December 28, 2019 - 17:15

లేడీ అమితాబ్ గా పేరొందిన విజయశాంతి దాదాపు దశాబ్దంన్నర తర్వాత రీ-ఎంట్రీ వస్తోంది. ఆమె స్థాయికి ఈ మాత్రం తగ్గకుండా చూసుకుంటోంది  సరిలేరు నీకెవ్వరు టీం. టీజర్లో మంచి ప్రొమినెన్సు ఇచ్చారు. సినిమాలో ఆమె పాత్రకి చాలా వేల్యూ  ఉంటుందంట. ఇక ఇప్పుడు ప్రీ-రిలీజ్ ఈవెంట్ లోనూ ఆమెకి స్పెషల్ గా ఆడియో వీడియో హంగామా ఉంటుంది. 

అన్నిటికన్నా ముఖ్యంగా... విజయశాంతి, మెగాస్టార్ చిరంజీవి ఒకే వేదికపై కనిపించనున్నారు. వీరిద్దరిది సూపర్ హిట్ జోడి. దాదాపు 16 సినిమాల్లో కలిసి నటించారు. ఐతే గత 20 ఏళ్లుగా వీరు ఎప్పుడు పబ్లిక్ వేదిక పై కలుసుకోలేదు. రాజకీయాలు, ఇతరత్రా కారణాల వాళ్ళ వారి దారులు వేరుగా నడిచాయి. ఇప్పుడు ఇద్దరూ ఒకే వేదికపై ఆసీనులై అభిమానులను మురిపించనున్నారు. 

చిరంజీవి కొత్త సినిమాలో విజయశాంతి నటించనుంది అని ఆ మధ్య కొన్ని పుకార్లు షికార్లు చేశాయి కానీ అది వర్క్ అవుట్ కాలేదు. 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 5న జరగనుంది. ఈ ఈవెంట్ కి చిరంజీవి ముఖ్య అతిధి.