చిరంజీవికి మొదలైన ట్రోలింగ్

Chiranjeevi gets trolled
Friday, September 27, 2019 - 15:45

మెగాస్టార్‌ చిరంజీవి సడెన్‌గా ట్రోలింగ్‌కి గురవుతున్నాడు. దానికో రీజన్‌ ఉంది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కి చిరంజీవి ఓ సలహా ఇచ్చారు. అదేంటంటే... మీరు రాజకీయాల నుంచి తప్పుకొండి...పార్టీ పెట్టొద్దు..ఎన్నికల్లో పాల్గొనవద్దు. ఇది మెగాస్టార్‌...సూపర్‌స్టార్‌కి ఇచ్చిన అడ్వైజ్‌. రజనీకాంత్‌ ఇప్పటికే పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించి రెండేళ్లు అయింది. పార్టీ పేరు చెప్పలేదు, కార్యకర్తలు లేరు, పార్టీ స్ట్రక్చర్‌ లేదు. అచ్చంగా పవన్‌ కల్యాణ్‌లాగే... ఎన్నికల టైమ్‌ వచ్చినపుడు పార్టీని బలోపేతం చేద్దాంలే మన చరిష్మా ఉంది కదా అనుకుంటున్నట్లు ఉంది. ఐతే అలా అతివిశ్వాసం వల్లే మెగాస్టార్‌, ఆ తర్వాత పవర్‌స్టార్‌ ఇద్దరూ పాలిటిక్స్‌లో బొక్కాబోర్లా పడ్డారు. 

ఆ అనుభవంతోనే రజనీకాంత్‌కి సలహా ఇచ్చాడు మెగాస్టార్‌. అక్కడి వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. తర్వాత మరికొన్ని కామెంట్లు కూడా చేశారు చిరంజీవి. ఇపుడు అంతా మనీ పాలిటిక్స్‌ అనీ, రాజకీయాల్లో డబ్బే గెలుస్తుందని అన్నట్లుగా మాట్లాడారు చిరంజీవి. డబ్బులు ఇస్తేనే జనం ఓటేస్తారన్నట్లుగా మాట్లాడారు. అది బాగా ట్రోలింగ్‌కి గురవుతోంది.

"మరి రాజకీయాల్లో సినిమా హీరోలు గెలవలేరు, రాజకీయాలు పాలిటిక్స్‌ సున్నితమైన సినిమా తారలకి పనికిరావనేది చిరంజీవి అభిప్రాయం అయితే అదే సలహా తమ్ముడు పవన్‌ కల్యాణ్‌కి ఇవ్వొచ్చు కదా. ఎలాగూ ఓడిపోయావ్‌..ఇక రాజకీయాలు మానేసి సినిమాలు చేసేయ్‌ అని తమ్ముడు పవన్‌ కల్యాన్‌కి సలహా ఇవ్వొచ్చు కదా," అంటూ ట్రోలర్స్‌ చిరంజీవిని ఆడుకుంటున్నారు.