సీఎం జగన్ ని కలవనున్న చిరు, చరణ్

Chiranjeevi to meet AP CM YS Jagan Mohan Reddy
Thursday, October 10, 2019 - 13:30

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్మ త్వరలోనే ర్యాదపూర్వకంగా కలవనున్నారు. రాజకీయంగా బద్ద విరోధులైన చిరంజీవి కుటుంబం ... జగన్ మోహన్ రెడ్డిని కలవనుండడం విశేషమే. సైరా సినిమాకి రెండు వారాలపాటు ఆరు షోలు వేసుకునేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. అందుకు కృతజ్ఞతలు చెప్పేందుకు వెళ్తున్నారు చరణ్, చిరు. సైరా సినిమాకి రామ్ చరణ్ నిర్మాత. 

మెగాస్టార్ ని సీఎం జగన్ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు కానీ అప్పుడు చిరంజీవి వెళ్ళలేదు. అయితే, జగన్ ప్రభుత్వంతో ఘర్షణ వైఖరి అవలంబించడం మెగాస్టార్ కి ఇష్టం లేదు. ఆయన పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్రభుత్వంతోనైనా సఖ్యంగానే ఉంటారు ఇక. ఇక్కడ తెలంగాణాలోనూ కెసిఆర్ ప్రభుత్వంతో మంచి సంబంధాలే ఉన్నాయి. 

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ రాజకీయాలు వేరు. ఆ పోరాటం కొనసాగుతుంది. చిరంజీవి మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటారట.