తమ్ముడికి చిరంజీవి విశాఖ షాక్

Chiranjeevi supports Vishaka as AP capital city
Saturday, December 21, 2019 - 20:00

ఏపీ ముఖ్యమంత్రి ప్రతిపాదించిన 'మూడు రాజధానుల' కాన్సెప్ట్ ని జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తున్నారు. కానీ దానికి జై కొట్టారు చిరంజీవి. వికేంద్రీకరణకి ఇది బెస్ట్ పాలసీ అంటూ చిరంజీవి... ఏకంగా ముఖ్యమంత్రిని మెచ్చుకుంటూ లేఖ రాశారు. స్థూలంగా... ఏపీ రాజధానిని విశాఖ తరలించడమే ఈ మూడు రాజధానుల కాన్సెప్ట్. చిరంజీవి కూడా విశాఖకి జై కొట్టారు. 

చాలా కాలంగా చిరంజీవి... విశాఖలో స్థిరపడాలని ఉందని చెప్తున్నారు. విశాఖలో సినిమా ఇండస్ట్రీని డెవలప్ కావాలంటే... ఏపీ రాజధానిని విశాఖకి తరలించాలని ... ఆ మధ్య జగన్ తో జరిగిన భేటీలో చెప్పారట. అది ఇప్పుడు నిజం అవుతోంది. మరి నిజంగా చిరంజీవి... హైదరాబాద్ నుంచి సినిమా పరిశ్రమని తరలించే సాహసం చేస్తారా? లేదా జగన్ తోను సత్సంబంధాల కోసమే ఇలా చేస్తున్నారా అనేది కాలమే చెప్పాలి. 

వైజాగ్ లో స్టూడియో ల్యాండ్స్ కోసం చిరంజీవి కొంత కాలంగా ట్రై చేస్తున్నారు అనేది ఒక టాక్.

జనసేన అధ్యక్షుడి హోదాలో పవన్ కళ్యాణ్ ... జగన్ పై పూర్తిగా ఎదురుదాడి చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి పాలసీలను తప్పు పడుతున్నారు. జగన్ రెడ్డి అంటూ సంబోధిస్తూ... కొంత కలకలం రేపారు పవన్ కళ్యాణ్. కానీ చిరంజీవి వైఖరి పవన్ కళ్యాణ్ కి భిన్నంగా  ఉంది. అలాగని... అన్నదమ్ముల మధ్య విభేదాలు ఉన్నాయి అని అనుకోవద్దు. అలాంటిదేమి లేదని... మొన్నే ఓ దినపత్రిక ఇంటర్వ్యూలోనూ పవర్ స్టార్ క్లారిటీ ఇచ్చారు.