మెగాస్టార్‌ మెగాఫోన్‌ పట్టుకోనిది అందుకే

Chiru reveals about his direction plans
Monday, September 23, 2019 - 13:30

మెగాస్టార్‌ చిరంజీవికి డైరక్షన్‌ చేయాలనే కోరిక ఉంది. మెగాఫోన్‌ (లౌడ్‌ స్పీకర్‌లాంటిది) పట్టుకొని కెమెరా, యాక్షన్‌, స్టార్ట్‌ చెప్పాలని చాలా కాలంగా అనుకుంటున్నారు. తాను నటించే చాలా సినిమాల్లో కొన్ని సీన్లు తానే తీసుకుంటారనే గుసగుసలు కూడా చాలా కాలంగా ఉన్నాయి. అయితే ఆయన ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవితం ఆధారంగా పరుచూరి బ్రదర్స్‌ రెడీ చేసిన స్క్రిప్ట్‌తో డైరక్షన్‌ చేపడుదామని 10 ఏళ్ల క్రితం అనుకున్నారు. ఈ గ్యాప్‌లో చాలా మారాయి. 

సైరా సినిమా మొదలుపెడుదామని అనుకున్నప్పుడు కూడా పరుచూరి బ్రదర్స్‌ మీరే డైరక్ట్‌ చేయండని చెప్పారట. కానీ చిరంజీవి ఒప్పుకోలేదు. 

నేను నటిస్తూ, ఇంత పెద్ద సినిమాని డైరక్ట్‌ చేయడం అంటే మాటలు కాదు. డైరక్షన్‌ చేయడం నాకు వచ్చు. కానీ సైరాలాంటి పీరియడ్‌ సినిమా ఇన్ని కోట్లతో తీయాలనుకున్నపుడు రెండు బాధ్యతలు వద్దనుకున్నాను, అని చిరంజీవి అసలు విషయాన్ని బయటపెట్టారు. మరి మెగాస్టార్‌ అఫీషియల్‌గా డైరక్టర్‌ అయ్యేది ఎపుడో?