ప్రకాష్ రాజ్ ఫామ్ హౌజ్ లో ఫుల్ ఎంజాయ్

Christmas party at Prakash Raj's Farm House
Thursday, December 26, 2019 - 22:30

సందర్భం రావాలి కానీ పరిశ్రమలో పార్టీలకు కొదవలేదు. ఈ విషయంలో చిన్నాపెద్దా తేడా లేదు. అంతా పార్టీలకు సై అంటారు. ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. అందుబాటులో ఉన్న ఫ్రెండ్స్ అందర్నీ ఆహ్వానిస్తారు. అలాంటిదే ఓ పెద్ద పార్టీ రాత్రి గ్రాండ్ గా జరిగింది. ప్రకాష్ రాజ్ ఫామ్ హౌజ్ దీనికి వేదికగా మారింది.

షాద్ నగర్ సమీపంలో ప్రకాష్ రాజ్ కు పెద్ద ఫాంహౌజ్ ఉంది. దాదాపు 5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో వెలిసిన ఈ ఫాంహౌజ్, రాత్రి పార్టీతో ధగధగలాడింది. ఇదే ఫాంహౌజ్ కు కూతవేటు దూరంలో రవితేజకు కూడా ఓ ఫాంహౌజ్ ఉంది. అతడు కూడా రాత్రి ఈ పార్టీకి హాజరయ్యాడు. దర్శకుడు కృష్ణవంశీతో పాటు మరికొంతమంది టాలీవుడ్ ప్రముఖులు, హీరోయిన్లు ఈ పార్టీలో సందడి చేశారు.

క్రిస్మస్ సందర్భంగా ప్రకాష్ రాజ్ ఈ పార్టీ ఇచ్చాడు. దాదాపు 2 రోజుల ముందు నుంచే కొంతమందిని స్వయంగా ఆహ్వానించాడు. అలా అంతా కలిసి రాత్రి పండగ చేసుకున్నారు. అదే పార్టీలో చిన్న మ్యూజికల్ నైట్ కూడా జరిగింది. టాలీవుడ్ కు చెందిన ఇద్దరు ప్రముఖ హీరోలు, మరో ఫేడవుట్ హీరోయిన్ ఈ పార్టీలో ఫుల్ గా ఎంజాయ్ చేశారు.