లాక్డౌన్ లో సన్నబడ్డ విద్యు

Comedian Vidyu slims down
Tuesday, June 23, 2020 - 13:45

బొద్దుతనానికి బ్రాండ్ అంబాసిడర్ ... విద్యుల్లేఖ రామన్. తన బాబ్లీ యాక్టింగ్, ఎక్స్ ప్రెషన్ తో మంచి కామెడీ పంచె విద్యు తక్కువ టైంలో తెలుగులో పాపులర్ అయింది. చెన్నైకి చెందిన ఈ తమిళ పొన్ను తెలుగులో లీడింగ్ కమెడియన్. ఈ అమ్మడు గొప్ప నటి కాదు.... ఆ బొద్దు తనం, ఆ ఆకారం వల్ల  పుట్టే కామెడీ నే ఆమెకి ప్లస్ పాయింట్. 

కానీ ఇప్పుడు బొద్దు గా ఉండదల్చుకోలేదు. సన్నబడుతోంది.

లాక్డౌన్ లో అధిక బరువును తగ్గించుకొంది. సగం తగ్గింది. ఆ ఫోటోని షేర్ చేసింది. హెల్తీ ఫుడ్, వర్కౌట్ లతో తగ్గిందిట. ఒక గోల్ పెట్టుకొని పనిచేస్తే తగ్గడం పెద్ద కష్టం కాదు అని అంటోంది.