నాని-సుదీప్ పై వెరైటీ కంపారిజన్

Comparison between Nani and Sudeep
Thursday, September 12, 2019 - 13:30

వీళ్లిద్దరూ కలిసి గతంలో ఈగ అనే సినిమా చేశారు. సుదీప్ కు తెలుగులో పాపులారిటీ తెచ్చిన చిత్రంగా ఈగ నిలిస్తే, ఆ టైమ్ కు నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. మూవీలో నాని హీరోగా నటిస్తే, సుదీప్ విలన్ గా నటించాడు. హీరోయిన్ (సమంత)ను దక్కించుకునేందుకు ఇద్దరూ ఓ రేంజ్ లో పోటీపడతారు. ఇప్పుడు వీళ్లిద్దరి మధ్య మళ్లీ పోటీ మొదలైంది.

ఈసారి కూడా సుదీప్, నాని పోటీపడుతున్నారు. అయితే ఈగ సినిమా టైపులో హీరో-విలన్ పాత్రలతో వీళ్లు పోటీపడడం లేదు. ఈసారి ఇద్దరూ హీరోలే. చెరో సినిమా రెడీ చేశారు. ఆ రెండూ 24 గంటల గ్యాప్ లో థియేటర్లలోకి వస్తున్నాయి. సుదీప్ నటించిన పహిల్వాన్ సినిమా రేపు థియేటర్లలోకి వస్తోంది. ఇది వచ్చిన 24 గంటల గ్యాప్ లో ఎల్లుండి (13న) నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా వస్తోంది.

నిజానికి బాక్సాఫీస్ సక్సెస్, రెవెన్యూ పరంగా సుదీప్, నాని సినిమాల మధ్య కంపారిజన్స్ అనవసరం. గ్యాంగ్ లీడర్ పైనే అందరి దృష్టి ఉంది. పహిల్వాన్ ను కేవలం ఓ డబ్బింగ్ సినిమాగా మాత్రమే చూస్తున్నారు తెలుగు జనం. కాకపోతే వీళ్లిద్దరూ ఇలా బాక్సాఫీస్ బరిలోకి ఒకేసారి రావడంతో ఈగ సినిమా సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్ గా మారిందంతే.