పేద కళాకారులకి రాజశేఖర్ చేయూత

Corona: Rajasekhar helps poor movie artistes
Sunday, March 22, 2020 - 16:30

కరోనా కారణంగా షూటింగులన్నీ రద్దు అయ్యాయి. షూటింగులు లేకపోతే కార్మికులకు ఇబ్బంది. డైలీ వేజెస్ మీద బతికే వారి పొట్ట కొట్టినట్లే. అలాగే జూనియర్ ఆర్టిస్టులు, పేద కళాకారులకు ఇల్లు గడవదు. అందుకే... తమ వంతుగా సాయం చేసేందుకు రాజశేఖర్, జీవిత దంపతులు ముందుకొచ్చారు. 

షూటింగ్ లు రద్దు కావడంతో పనిలేక ఇబ్బంది పడుతోన్న నిరుపేద కళాకారులకు... పది రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులను రాజశేఖర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా  ఇవ్వాలని నిర్ణయించారు రాజశేఖర్. 

"రెక్కాడితే గాని డొక్కాడని నటీ నటులు, 9010810140 నంబర్ లో నవీన్ వర్మకు తమ పూర్తి వివరాలు అందించి తగు సహాయం పొందగలరు, సదా మీ సేవలో.. మీ డా|| రాజశేఖర్ & జీవితా రాజశేఖర్," అంటూ "మా" సభ్యులకు సందేశం పంపారు.