బాండ్ గర్ల్ కు కరోనా

Coronavirus: Bond girl Olga Kurylenko tests positive
Monday, March 16, 2020 - 18:00

జేమ్స్ బాండ్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటాడో, అతడి ప్రియురాళ్లు కూడా అంతే పవర్ ఫుల్ గా ఉంటారు. కనిపించకుండా కత్తులు దాచుకొని, అవసరమైనప్పుడు వీరావేశంతో విలన్లపై విరుచుకుపడుతుంటారు.  అయితే ఇదంతా తెరపై మాత్రమే. రియల్ లైఫ్ లో బాండ్ గర్ల్ కరోనా బారిన పడింది. ఆమె పేరు ఓల్గా కుర్లెంకో.

క్వాంటమ్ సోలస్ అనే జేమ్స్ బాండ్ సినిమాలో బాండ్ గర్ల్ గా నటించిన ఓల్గాకు కరోనా సోకింది. ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించింది. వారం రోజుల నుంచి జ్వరం, బాడీ పెయిన్స్ ఉన్నాయని.. తాజాగా చేసిన టెస్టుల్లో కరోనా పాజిటివ్ వచ్చినట్టు తేలిందని ప్రకటించింది ఓల్గా. ప్రస్తుతం తను తన ఇంట్లోనే ఏకాంతంగా ఉన్నానని, కరోనాను ప్రజలంతా సీరియస్ గా తీసుకోవాలని విజ్ఞప్తిచేస్తోంది.

కొన్ని రోజుల కిందట హాలీవుడ్ నటుడు టామ్ హ్యాంక్స్ కరోనా బారిన పడ్డాడు. ఆ టైమ్ లో ఆయన భార్యకు కూడా కరోనా సోకింది. ఇప్పుడు బాండ్ గర్ల్ ఓల్గా కు కూడా కరోనా వచ్చింది