తప్పు తెలుసుకున్న దర్బార్

Darbar Team realized their mistake
Thursday, November 7, 2019 - 15:15

తమిళ జనాలకు టాలీవుడ్ అంటే ఎప్పుడూ చిన్నచూపే. తమ సినిమాలు తెలుగులో రెగ్యులర్ గా రిలీజ్ అవుతున్నప్పటికీ.. టాలీవుడ్ లో సెపరేట్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ ఈ మార్కెట్ పై వాళ్లు పెద్దగా ఫోకస్ పెట్టరు. టాలీవుడ్ పై కోలీవుడ్ మేకర్స్ కు ఉన్న వివక్ష దర్బార్ రూపంలో మరోసారి బయటపడింది. ఈ సినిమా మోషన్ పోస్టర్ ను ప్రతి పరిశ్రమలో ఉన్న సూపర్ స్టార్ తో రిలీజ్ చేయాలని భావించారు.

అనుకున్నదే తడవుగా కోలీవుడ్ నుంచి కమల్ హాసన్ ను, మల్లూవుడ్ నుంచి మోహన్ లాల్ ను, బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్ ను రంగంలోకి దించారు. కానీ వాళ్లకు టాలీవుడ్ లో సూపర్ స్టార్స్ ఎవరూ కనిపించలేదు. తెలుగు మోషన్ పోస్టర్ ను కూడా కమల్ తోనే రిలీజ్ చేయాలని భావించారు. సరిగ్గా ఇక్కడే టాలీవుడ్ ఆడియన్స్ కు కాలింది. మురుగదాస్, రజనీకాంత్ పై ఒకటే ట్రోలింగ్స్

నిజానికి టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు. రజనీకాంత్ కోరితే ఇలాంటి ఓపెనింగ్స్ కు రావడానికి చిరుకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. కానీ అలాంటి ప్రయత్నం జరిగినట్టు లేదు. మొత్తమ్మీద ట్రోలింగ్ తో యూనిట్ దిగొచ్చింది. మోషన్ పోస్టర్ లాంచింగ్ కు మహేష్ ను సెలక్ట్ చేసుకుంది. చిరంజీవి కంటే మహేష్ సోషల్ మీడియాలో యాక్టివ్. పైగా సూపర్ స్టార్ ఇమేజ్ తో ఉన్నాడు. అలా మహేష్ చేతుల మీదుగా మరికొద్దిసేపట్లో దర్బార్ మోషన్ పోస్టర్ రిలీజ్ అవుతుంది.