డియ‌ర్ కామ్రేడ్ డేట్‌పై క‌న్‌ఫ్యూజ‌న్‌

Dear Comrade in confusion about release date
Saturday, April 27, 2019 - 17:30

విజయ్ దేవరకొండ నటించిన "డియర్ కామ్రేడ్" మే 31 నుంచి తప్పుకొంది. సూర్య సినిమా కోసం విజయ్ దేవరకొండ తన సినిమాని వాయిదా వేశాడు. విజయ్ దేవరకొండకి ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో కూడా ఫాలోయింగ్ వచ్చింది. ఇపుడు సౌత్ అంతా తన సినిమాలకి మార్కెట్ ని పెంచుకునేందుకు భారీ స్కెచ్ వేశాడు. ఇక నుంచి తన సినిమాలని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నాడు.

ఐతే తమిళనాట పెద్ద హీరోలతో పోటీ పడితే..... అక్కడి ఫ్యాన్స్ తనని బదనామ్ చేస్తారని తెలుసు. అందుకే తెలివిగా మే 31న తన సినిమాని రిలీజ్ చేయడం లేదు విజయ్ దేవరకొండ. ఐతే ఏ డేట్‌కి విడుదల చేయాలనే విషయంలోనే మల్లగుల్లాలు పడుతున్నారు. జూన్ మూడో వారంలో విడుదల చేస్తే ఆడుతుందా అనేది ఒక డౌట్. జులై మొదటి వారం వరకు వెయిట్ చేస్తే ఎలా ఉంటుందని ఇపుడు ఆలోచన చేస్తున్నారట.

ఈ మూవీకి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు. కాకినాడ నేపథ్యంగా రూపొందుతోంది. భరత్ కమ్మ అనే కొత్త దర్శకుడు తీసిన "డియర్ కామ్రేడ్‌"లో రష్మిక హీరోయిన్.