మొదటిరోజు మెరిసిన దేవదాస్

Devadas first day collections
Friday, September 28, 2018 - 17:15

నాగార్జున, నాని కలిసి నటించిన "దేవదాస్" సినిమా మొదటి రోజు బాగానే మెరిసింది. అక్కడక్కడ మిక్స్ డ్ రిజల్ట్ ఉన్నప్పటికీ, సినిమాపై ఉన్న క్రేజ్ కారణంగా ఫస్ట్ డే మంచి వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 4 కోట్ల 67 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఇక వరల్డ్ వైడ్ చూసుకుంటే, 6 కోట్ల 57 లక్షల రూపాయల షేర్ వచ్చింది దేవదాస్ సినిమాకు. ప్రస్తుతం మార్కెట్లో బ్రహ్మాడంగా ఆడుతున్న సినిమాల్లేవు.

"శైలజారెడ్డి అల్లుడు" మాత్రమే ఉన్నంతలో మెరుగ్గా నడుస్తోంది. కాబట్టి, ఈ వీకెండ్ దేవదాస్ కు అదిరిపోయే వసూళ్లు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక ఏపీ, నైజాంలో దేవదాస్ కు వచ్చిన మొదటి రోజు షేర్ ఇలా ఉంది.

నైజాం - రూ. 1.68 కోట్లు
సీడెడ్ - రూ. 0.73 కోట్ల
ఉత్తరాంధ్ర - రూ. 0.58 కోట్లు
ఈస్ట్ - రూ. 0.39 కోట్లు
వెస్ట్ - రూ. 0.26 కోట్లు
కృష్ణా - రూ. 0.32 కోట్లు
నెల్లూరు - రూ. 0.19 కోట్లు