తమన్ ని దేవిశ్రీ ఫాలో అవ్వాలా?

Devi Sir Prasad should follow Thaman?
Monday, December 30, 2019 - 12:15

మ్యూజిక్ డైరక్టర్ డీఎస్పీకి ప్రస్తుతం బ్యాడ్ ఫేజ్ నడుస్తోంది. ఎంత కష్టపడి సాంగ్ కంపోజ్ చేసినా అది విమర్శల పాలవుతోంది. సరిగ్గా రెండేళ్ల కిందట తమన్ ఎలాంటి పరిస్థితి ఫేస్ చేశాడో, ఇప్పుడు దేవిశ్రీప్రసాద్ ది కూడా అదే పరిస్థితి. అతడి పాటల్ని అతడే కాపీ కొడుతున్నాడనే విమర్శలు ఎక్కువవుతున్నాయి. సరిలేరు నీకెవ్వరు సినిమాకు ఒక్కటంటే ఒక్క హిట్ సాంగ్ కూడా ఇవ్వలేకపోయాడనేది డీఎస్పీపై ప్రధానమైన ఆరోపణ. నిజానికి... టైటిల్ సాంగ్, రీసెంట్ గా వచ్చిన డాంగ్ డాంగ్ బావున్నాయి కానీ జనాలు మాత్రం పూర్తిగా శాటిస్ ఫై కావడం లేదు. 

ఈ నేపథ్యంలో... చాలామంది తమన్ లా బ్రేక్ తీసుకోమని దేవిశ్రీకి సూచిస్తున్నారు. వరుసగా విమర్శలు వెల్లువెత్తిన సమయంలో.. కాపీ క్యాట్ అంటూ అంతా తనపై విరుచుకుపడిన రోజుల్లో తమన్ ఆలోచనలో పడ్డాడు. గ్యాప్ తీసుకోవడమే ఉత్తమమని భావించాడు. అంతే.. సరైనోడు తర్వాత దాదాపు ఏడాది గ్యాప్ తీసుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ ఫీల్డ్ లోకి వచ్చిన తమన్, వెనక్కి తిరిగి చూసుకోలేదు. మహానుభావుడు, భాగమతి, తొలిప్రేమ, అరవింద సమేత సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చాడు. ఇప్పుడు అల వైకుంఠపురములో సినిమాతో టాప్ ప్లేస్ లోకి వచ్చేశాడు.

సో.. దేవిశ్రీ కూడా ఇదే తరహాలో చిన్న గ్యాప్ తీసుకొని తన కెరీర్ ను ఓసారి సమీక్షించుకుంటే మంచిదని చాలా మంది అతడికి సూచనలు ఇస్తున్నారు.  ప్రస్తుతానికైతే దేవిశ్రీ నెమ్మదించాడు. త్వరలోనే చిన్న విరామం కూడా తీసుకుంటాడేమో చూడాలి.