బ‌రిలో దిగిన ధ‌నుష్‌

Dhanush film releasing on Dec 21
Monday, December 17, 2018 - 15:45

ఇప్ప‌టికే మూడు పెద్ద సినిమాలు బ‌రిలో ఉన్నాయి. ఈ వీకెండ్ మ‌రో సినిమా వ‌చ్చి చేరింది. ర‌ఘువ‌ర‌న్ చిత్రం తో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ధ‌నుష్ హీరోగా, ఫిదా, ఎం.సి.ఏ లాంటి వ‌రుస విజ‌యాల‌తో పాపుల‌ర్ అయిన సాయిప‌ల్ల‌వి హీరోయిన్ గా న‌టించిన త‌మిళ చిత్రం మారి2 తెలుగులో విడుద‌ల అవుతోంది. ఈ సినిమాని కూడా డిసెంబ‌ర్ 21నే విడుద‌ల చేస్తున్నామని ప్ర‌క‌టించారు.

డిసెంబ‌ర్ 21న అంత‌రిక్షం, ప‌డి ప‌డి లేచే మ‌న‌సు, కేజిఎఫ్ సినిమాలు విడుద‌ల అవుతున్నాయి. వాటితో ధ‌నుష్ మూవీ పోటీప‌డ‌నుంది.

.బాలీజీ మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాని  సాయికృష్ణా ఫిలింస్ అధినేత సాయి కృష్ణ పెండ్యాల విడుద‌ల చేస్తున్నారు. డిసెంబ‌ర్ 21న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మారి2 లో ఓ సాంగ్ ని లెజెండ్ ఇళ‌య‌రాజా పాడ‌గా, హీరో ధ‌నుష్ లిరిక్స్ అందించారు. ఈ సాంగ్ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది.