ప్ర‌భాస్ క‌న్నా ముందే శ‌ర్వా చేసేశాడుగా

Different music directors for single film
Tuesday, July 30, 2019 - 12:15

ఒకే సినిమాలో వివిధ సంగీత ద‌ర్శ‌కులతో పాట‌లు చేయించ‌డం అనేది బాలీవుడ్‌లో రెగ్యుల‌ర్‌ ట్రెండ్. ముఖ్యంగా టీ సీరిస్ సంస్థ నిర్మించే లేదా కొనే సినిమాల‌కి ఈ ప‌ద్ద‌తిని ఎక్కువ‌గా పాటిస్తున్నారు. ప్ర‌స్తుతం ఫామ్‌లో ఉన్న కొత్త సంగీత ద‌ర్శ‌కులు, గాయ‌కులతో పాట‌లు చేయించి...సినిమాల్లో పెడుతుంటారు. ఇదే ప‌ద్ద‌తి ఇపుడు "సాహో"లోనూ ఉంది. ఐతే సాహో క‌న్నా ముందే "ర‌ణ‌రంగం"లో మ‌నం ఈ ట్రెండ్‌ని చూడ‌బోతున్నాం.

శ‌ర్వానంద్ హీరోగా న‌టిస్తున్న "ర‌ణ‌రంగం"లో ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన మూడు పాట‌లు ముగ్గురు వేర్వేరు సంగీత ద‌ర్శ‌కులు కంపోజ్ చేసిన‌వి. మొద‌టి పాట "సీత కల్యాణం "...మ‌ల‌యాళ సంగీత ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ పిళ్లై కంపోజిష‌న్‌లో వ‌చ్చింది. ఇది అత‌నికి తొలి తెలుగు పాట‌. రెండో పాట‌ని కార్తీక్ రోడ్రీగ్జ్ కంపోజ్ చేశాడు. "క‌న్ను కొట్టి" అనే పాట అత‌నిదే.

తాజాగా విడుద‌లైంది... "పిల్ల పిక్చ‌ర్ ప‌ర్‌ఫెక్ట్‌". ఈ పాట‌ని స‌న్నీ ఎంఆర్ కంపోజ్ చేశాడు. స్వామి రారా వంటి సినిమాల‌కి పాట‌లు అందించాడు స‌న్నీ. మిగ‌తా పాట‌లూ అంతే. అంటే ప్ర‌భాస్ క‌న్నా ముందే శ‌ర్వానంద్ ఈ ప‌ని కానిచ్చేశాడ‌న్న‌మాట‌.

అన్న‌ట్లు వీరిద్ద‌రి క‌న్నా ముందే రాజ్ త‌రుణ్ ఇదే ట్రెండ్‌ని సెట్ చేశాడు. "ల‌వ‌ర్ "(ఇది ఫ్లాప్‌) అనే సినిమాలోఇలాంటి ప్ర‌యోగ‌మే చేశారు కానీ అది అంత‌గా గుర్తింపుకి నోచుకోలేదు.