జెర్సీ రీమేక్ దిల్‌రాజుకి వెళ్లింద‌ట‌

Dil Raju buys Jersey Hindi remake rights?
Thursday, June 27, 2019 - 20:30

బాలీవుడ్ నిర్మాత క‌ర‌ణ్ జోహ‌ర్ "జెర్సీ" సినిమా రీమేక్ రైట్స్ తీసుకున్నార‌ని ఇటీవ‌ల జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. కానీ అది నిజం కాద‌ట‌. దిల్‌రాజుతో పాటు మ‌రో నిర్మాత క‌లిసి ఆ సినిమా హిందీ రీమేక్ రైట్స్ తీసుకున్నార‌ట‌. ఈ సినిమాని బాలీవుడ్‌లో తీసి నేష‌న‌ల్ లెవ‌ల్లో పేరు తెచ్చుకోవాల‌ని అనుకుంటున్నారు టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్‌రాజు.

ఇటీవ‌ల విడుద‌లైన తెలుగు సినిమాల్లో క్రిటిక్స్ ప్ర‌శంస‌లు అందుకున్న మూవీ..."జెర్సీ". నానికి న‌టుడిగా మ‌రోసారి బాగా నేమ్ అండ్ ఫేమ్ తెచ్చిన మూవీ ఇది. "అర్జున్‌రెడ్డి" రీమేక్ "క‌బీర్‌సింగ్"... హిందీలో సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో బాలీవుడు చూపు మ‌న తెలుగు సిన‌మాల వైపు ప‌డింది. క్రికెట్ నేప‌థ్యంగా సాగిన యూనివ‌ర్స‌ల్ స‌బ్జెక్ట్‌...."జెర్సీ". అందుకే ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం పోటీ ఏర్ప‌డింది.

ఐతే దిల్‌రాజు, మ‌రో నిర్మాత‌తో చేతులు క‌లిపి దీన్ని హిందీలో తీయాల‌నుకుంటున్నాడ‌ట‌. ఇప్ప‌టికే "ఎఫ్ 2" సినిమాని హిందీలో బోనీక‌పూర్‌తో క‌లిసి నిర్మించనున్నాడు. ఇపుడు ఇది మ‌రోటి.