దిల్‌రాజు ప‌ర‌భాషా ప్ర‌య‌త్నం

Dil Raju focussing in other language movies
Monday, May 6, 2019 - 16:00

తెలుగులో స్టార్‌డ‌మ్ ఉన్న నిర్మాత‌ల్లో ఒక‌రు దిల్‌రాజు ఒక‌రు. నిర్మాత‌గానో, డిస్ట్రిబ్యూట‌ర్‌గా, స‌ల‌హాదారుడిగా...ఆయ‌న ఇన్‌వాల్వ్‌మెంట్ లేని సినిమాల సంఖ్య త‌క్కువ‌. ఆ రేంజ్‌లో తెలుగు సినిమాని ప్ర‌భావితం చేస్తున్నారు దిల్‌రాజు. ఆయ‌న ఇపుడు జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవాల‌నుకుంటున్నారు. 

శంక‌ర్ డైర‌క్ష‌న్‌లో భార‌తీయుడు 2 నిర్మించి... నేష‌న‌ల్ లెవ‌ల్లో సంచ‌ల‌నం సృష్టిద్దామ‌ని మొద‌ట అటెంప్ట్ చేశారు. ఐతే శంక‌ర్ చెప్పిన బ‌డ్జెట్, మార్కెట్ లేకున్నా 40 కోట్ల పారితోషికం అడిగిన క‌మ‌ల్ హాస‌న్ వైఖ‌రి చూసి వెంట‌నే డ్రాప్ అయ్యారు. చేతులు కాల‌క‌ముందే ఆకులు ప‌ట్టుకున్నారు.

ఇక ఇపుడు కోప్రొడ్యుస‌ర్‌గా తమిళంలోనూ, బాలీవుడ్‌లోనూ సినిమాలు చేసేందుకు అంతా సెట్ చేసుకున్నారు. బాలీవుడ్‌లో బోనీక‌పూర్‌తో చేతులు క‌లిపి ఎఫ్ 2 సినిమాని రీమేక్ చేయ‌నున్నారు. దానికి అంతా రెడీ అయింది. త‌మిళంలో విజ‌య్ హీరోగా ఒక సినిమాని మ‌రో త‌మిళ నిర్మాణ సంస్థ‌తో క‌లిసి తీసేందుకు చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి. మ‌రి దిల్‌రాజు ఇత‌ర భాష‌ల్లోనూ సక్సెస్ అవుతారా అనేది చూడాలి.