వి... తేల్చి చెప్పిన దిల్ రాజు

Dil Raju gives clarity about V
Wednesday, April 22, 2020 - 15:15

అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసిన "V" సినిమా రూమర్ పై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. ఎట్టి పరిస్థితిల్లోనూ సినిమాని ముందు థియేటర్లలోనే రిలీజ్ చెయ్యాలని దిల్ రాజు డిసైడ్ అయ్యారు. థియేటర్లలో కాకుండా మా డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లలో విడుదల చేస్తే భారీ మొత్తం ఇస్తామని ఓటిటీ కంపెనులు టెంప్టింగ్ ఆఫర్ ఇచ్చాయి. ఒక దశలో దిల్ రాజు అటు  కానీ హీరో నాని, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ససేమిరా వద్దన్నారు. 

అసలు బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ కోసమే తను V సినిమా తీశానని చెప్పుకొచ్చాడు డైరక్టర్. ఇప్పుడు దిల్ రాజు ఆ కంపెనీకి నో అని చెప్పేశాడు. ఇన్ని రోజులు 
నిర్ణయాన్ని పెండింగ్లో పెట్టి ఇప్పుడు తేల్చి చెప్పాడు.

లాక్ డౌన్ కారణంగా సినిమా రిలీజెస్ అన్నీ వాయిదాపడ్డాయి. ఎక్కువ ప్రభావం నాని-సుధీర్ బాబు హీరోలుగా నటించిన V సినిమాపైనే పడింది. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ కు జస్ట్ కొన్ని రోజుల ముందే లాక్ డౌన్ పడింది. లేదంటే ఇది థియేటర్లలోకి వచ్చి ఉండేది.