మ‌హ‌ర్షి వ‌ల్ల న‌ష్టం లేదు..దిల్‌రాజు క్లారిటీ

Dil Raju says no one lost on Maharshi
Thursday, July 25, 2019 - 00:30

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు న‌టించిన "మ‌హ‌ర్షి" సినిమా దాదాపు 100 కోట్ల రూపాయ‌ల థియేట్రిక‌ల్ రెవిన్యూని క‌లెక్ట్ చేసింది. మ‌హేష్‌బాబు కెరియ‌ర్‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్లు పొందిన మూవీ. కానీ ఈ సినిమాని నిర్మించిన నిర్మాత‌ల‌కి మాత్రం న‌యాపైసా మిగ‌ల్లేదు. అందుకే, దిల్‌రాజు చాలా అసంతృప్తితో ఉన్నాడ‌నీ, స‌రిలేరు నీకెవ్వరు సినిమాతో నుంచి కూడా దిల్‌రాజు త‌ప్పించుకోవాల‌నుకుంటున్నాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. అంతేకాదు, మ‌హేష్‌బాబు మ‌రో సినిమా కోసం త‌న‌కిచ్చిన డేట్స్‌ని వ‌దులుకోవాల‌ని దిల్‌రాజు చేస్తున్నాడ‌ని టముకు వేశారు. 

ఇదే విష‌యాన్ని దిల్‌రాజు వ‌ద్ద ప్ర‌స్తావిస్తే...అదంతా అబ‌ద్ద‌మ‌ని చెప్పాడు. మ‌హ‌ర్షి అంద‌రికీ ఫ్రాపిటుబుల్ వెంచ‌రే అని స్ప‌ష్టం చేశాడు. ఐతే రోజురోజుకీ పెరుగుతున్న శాల‌రీల నేప‌థ్యంలో... టాలీవుడ్ అగ్ర హీరోలు బాలీవుడ్ హీరోల త‌ర‌హాలో మారాల‌నేది ఆయ‌న చేసిన సూచ‌న‌. అమీర్‌ఖాన్‌, స‌ల్మాన్‌ఖాన్‌, ర‌ణ‌బీర్ క‌పూర్‌...ఈ పెద్ద హీరోలు ఎవ‌రూ పారితోషికం తీసుకోవ‌డం లేదు. వ‌చ్చిన లాభాల్లో వాటా తీసుకుంటున్నారు. దాంతో నిర్మాత‌కి బ‌ర్డెన్ ప‌డ‌డం లేదు. 

మ‌రో రెండు, మూడేళ్ల త‌ర్వాత అయినా మ‌న హీరోలు బాలీవుడ్ ఫార్మూలాని కాపీ కొట్టాల్సిందే అంటున్నాడు దిల్‌రాజు.