యూట్యూబ్‌లోనూ కేక పుట్టిస్తున్న దిమాక్‌ ఖరాబ్‌

Dimak Kharab songs goes viral
Monday, September 23, 2019 - 18:15

పూరి జగన్నాథ్‌ని మళ్లీ సక్సెస్‌ ట్రాక్‌లోకి తెచ్చిన సినిమా ఇస్మార్ట్‌ శంకర్‌. ఈ సినిమా...ఫుల్‌ప్లెడ్జెడ్‌ మాస్‌ మూవీ. మణిశర్మ అందించిన పాటలు మాస్‌కి కిక్‌ ఎక్కించాయి. ముఖ్యంగా దిమాక్‌ ఖరాబ్‌ పాట కేక పుట్టించింది. ఫుల్‌ బాటిల్‌ కొట్టిన హీరో డబుల్‌ భామలతో వేసిన స్టెప్పులు మాస్‌ని ఉర్రూతలూగించాయి. నిధి అగర్వాల్‌, నభా నటేష్‌ ఇద్దరూ పోటీపడి ఎక్స్‌పోజింగ్‌ చేశారు. 

క్లీవేజ్‌ షోలో ఇద్దరూ సిగ్గు చూపలేదు. అందుకే ఆ వీడియో సాంగ్‌ ఇపుడు యూట్యూబ్‌ని షేక్‌ చేస్తోంది. మూడు రోజుల క్రితం ఈ పాట ఫుల్‌ వీడియో సాంగ్‌ రిలీజ్‌ అయింది. మూడు రోజుల్లో కోటి వ్యూస్‌ను దక్కించుకుంది. అంతేకాదు, ఇండియాలో మూడో స్థానంలో ట్రెండ్‌ అవుతోంది వీడియో. 

రామ్‌ డ్యాన్స్‌, హీరోయిన్ల అందాల ఆరబోత ఈ పాటలోని స్పెషాలిటీ. అలాగే లిరిక్స్‌ కూడా.