డైర‌క్ట‌ర్ మ‌హేంద్ర‌న్ ఇక లేరు

Director J Mahendran passes away
Tuesday, April 2, 2019 - 11:15

త‌మిళ సినిమా రంగంలో ద‌ర్శ‌క దిగ్గ‌జం అన‌ద‌గ్గ డైర‌క్ట‌ర్ జే మ‌హేంద్ర‌న్ ఇక లేరు. మంగ‌ళ‌వారం ఉద‌యం ఆయ‌న క‌న్ను మూశారు. బాల‌చంద‌ర్‌, భార‌తీరాజా, బాలు మ‌హేంద్ర వంటి గొప్ప త‌మిళ ద‌ర్శ‌కుల స‌ర‌స‌న నిలిచే గ్రేట్ డైర‌క్ట‌ర్ మ‌హేంద్ర‌న్‌. ర‌జ‌నీకాంత్‌లోని ఆవేశాన్ని పట్టిన ద‌ర్శ‌కులు ఆయ‌న‌.

ఇత‌ర త‌మిళ ద‌ర్శ‌కుల్లా తెలుగులో ఆయ‌న సినిమాలు తీయ‌లేదు కానీ ఆయ‌న సినిమాలెన్నో తెలుగులోకి డ‌బ్ అయ్యాయి. ర‌జ‌నీకాంత్‌, శ్రీదేవి నటించిన "జానీ", సుహాసిని న‌టించిన "మౌన‌గీతం" వంటి అనువాద చిత్రాలు తెలుగులోనూ పాపుల‌ర్ అయ్యాయి. "మౌన‌గీతం"లోని "ప‌రువమే ప‌రుగు తీయ‌కు" పాట నేటికి చాలా పాపుల‌ర్‌.

రీసెంట్‌గా ర‌జ‌నీకాంత్ హీరోగా రూపొందిన "పేట్టా" సినిమాలో న‌టుడిగా క‌నిపించారు. ఆయ‌న పాట‌ల చిత్రీక‌ర‌ణ చాలా గొప్ప‌గా ఉండేది. ఆయ‌న పాట‌ల చిత్రీక‌ర‌ణ‌ని ద‌ర్శ‌కులు మ‌ణిర‌త్నం, రాఘ‌వేంద్ర‌రావు అనుకరించారు. ఇక ఆయ‌న కుమారుడు జాన్ మ‌హేంద్ర‌న్ తెలుగులో "నీతో" అనే సినిమాని డైర‌క్ట్ చేశారు. రాఘ‌వేంద్ర‌రావు కొడుకు ప్ర‌కాష్ కోవెల‌మూడి హీరో.