అల్లు అర్జున్‌తో మూవీ ఇపుడే కాదు

Director Parasuram says his movie with Allu Arjun will take time
Tuesday, August 28, 2018 - 18:30

"గీత గోవిందం" ద‌ర్శ‌కుడు పరశురామ్ గీత మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు సినిమాలు తీసినా...ఆయన పేరు సామాన్య ప్రేక్ష‌కుల‌కి అంత‌గా ప‌రిచ‌యం లేదు. గీత గోవిందంతో ఒక్క‌సారిగా అందరి చూపు ఆయ‌న‌పై ప‌డింది. 55 కోట్ల రూపాయ‌ల బ్లాక్‌బ‌స్ట‌ర్ ఈ మూవీ. ఇంత పెద్ద హిట్ రావ‌డంతో నిర్మాత‌లంతా ఆయ‌న వెంట ప‌డుతున్నారు. అల్లు అర్జున్ కూడా ఒక మూవీ చేయ‌మ‌ని అడిగాడ‌ని ఇటీవ‌ల ప్ర‌చారం జ‌రిగింది. ఐతే అది ఇపుడే ఉండ‌ద‌ని అంటున్నాడు ఈ న‌ర్సీప‌ట్నం బాబు.

"గీత గోవిందం విజయంతో జీవితం ఓ కొత్త మలుపు తిరిగింది దాంతో  పాటు  బాధ్యత కూడా పెరిగింది. ఇక నుంచి డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌లతో సినిమాలే చేస్తాను," అని అంటున్నాడు పరశురామ్. ఆయ‌న త‌దుప‌రి చిత్రం కూడా బ‌న్ని వాస్ నిర్మాణంలోనే ఉంటుంద‌ట‌. బ‌న్ని వాసు గీత గోవిందం సినిమాకి నిర్మాత‌. అల్లు అర‌వింద్ ఈ సినిమాకి ప్రెజెంట‌ర్‌.

"అల్లు అర్జున్‌తో కూడా సినిమా చేయాలని అనుకుంటున్నాను. కానీ ఆ సినిమాకు సంబంధించిన వివరాలు గీతా ఆర్ట్స్‌ సంస్థ ప్రకటిస్తే బాగుంటుంది, అది ఇప్ప‌ట్లో ఉంటుంద‌నుకోవ‌డం లేదు," అని మీడియాకి చెప్పాడు.