ఎస్ స‌ర్ అనే డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్‌

Director Prashanth Varma slams rumors about Rajasekhar
Monday, December 17, 2018 - 16:30

యువ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌కి హీరో డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ చుక్క‌లు చూపిస్తున్నాడ‌ని గుస‌గుస వినిపిస్తోంది. నాని నిర్మించిన అ సినిమాతో పరిచ‌య‌మైన ప్ర‌శాంత్ వ‌ర్మ ప్ర‌స్తుతం క‌ల్కి అనే సినిమాని డైర‌క్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరో రాజ‌శేఖ‌ర్‌. ఆయ‌న కుటుంబ స‌భ్యులే సినిమాని నిర్మిస్తున్నారు.

ఐతే ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ అడిగినదేదీ ఇవ్వ‌డం లేద‌ని, ఎక్కువ టేక్‌ల‌కి ఒప్పుకోవ‌డం లేద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ వార్త‌ల‌పై స్పందించిన యువ ద‌ర్శ‌కుడు అలాంటిదేమీ లేదంటున్నాడు.

"నేను ప‌నిచేసిన వారిలో స్వీటెస్ట్ ప‌ర్స‌న్ రాజ‌శేఖ‌ర్ గారు. నేను ఎలాంటిది చేయ‌మ‌న్నా కెమెరా ముందు చేసేస్తున్నారు. ఎస్ స‌ర్ అంటూ నేను అడిగిన ప్ర‌తిదానికీ సై అంటున్నారు," అని ద‌ర్శ‌కుడు వివ‌ర‌ణ ఇచ్చాడు.

లోగుట్టు వారిద్ద‌రికే తెలియాలి. ద‌ర్శ‌కుడు మాట ప్ర‌కారం క‌ల్కి సెట్‌లో అంతా స‌వ్యంగానే సాగుతోంది.