పాత‌బ‌స్తీలో మాస్ మహారాజ

Disco Raja shoot is happening in old city
Saturday, June 15, 2019 - 15:15

మాస్ మహారాజా రవితేజ మొత్తానికి బిజీ అయిపోయాడు. గ‌తేడాది వ‌రుస‌గా మూడు ఫ్లాప్‌లు ఇవ్వ‌డంతో ఆరు నెల‌లు గ్యాప్ తీసుకున్నాడు. గ్యాప్ త‌ర్వాత గ‌త నెల‌లోనే వి ఐ ఆనంద్ దర్శకత్వంలో "డిస్కోరాజా" షూటింగ్ షురూ చేశాడు. ర‌వితేజ పాల్గొన్న భారీ షెడ్యూల్ పూర్త‌యింది. 

మాస్‌మ‌హ‌రాజ్ ర‌వితేజ‌, వెన్నెల కిషోర్ ల మ‌ధ్య‌ కీల‌క స‌న్నివేశాలు చిత్రీకరించారు.అలాగే హైద‌రాబాద్‌ పాత‌బ‌స్తీలోనూ మ‌రికొన్ని కీల‌క స‌న్నివేశాలు హీరో ర‌వితేజపై తీశారు. ఆర్ ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్, నన్ను దోచుకుందువటే ఫేమ్ నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మ‌రో హీరోయిన్ ఎంపిక ఇంకా కావాల్సి ఉంది. 

ఈ సినిమా షూటింగ్ పూర్త‌యిన వెంట‌నే బ‌లుపు ద‌ర్శ‌కుడు గోపిచంద్ మ‌లినేని డైర‌క్ష‌న్‌లో మ‌రో సినిమా మొద‌లుపెడుతాడ‌ట‌. ఈ సినిమాలో శ్రుతిహాస‌న్ న‌టించ‌నుంది.