దిశా ప‌టానీ ప్రేమ ఫ‌ట్‌

Disha Patani breaks up with Tiger Schroff
Tuesday, June 25, 2019 - 14:00

దిశా ప‌టానీ అంటే ఎక్కువ మంది తెలుగువారికి తెలియ‌క‌పోవ‌చ్చు. ఈ మ‌ధ్య బాలీవుడ్‌లో ఎక్కువ‌గా పాపుల‌ర్ అయింది ఈ టైగ‌ర్ కూన‌. తెలుగులో పూరి జ‌గ‌న్నాథ్ తీసిన లోఫ‌ర్ చిత్రంలో వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న న‌టించింది దిశా. ఐతే తెలుగులో ఆమె కెరియ‌ర్ స‌రైన దిశ‌లో సాగ‌లేదు. దాంతో మ‌ళ్లీ బాలీవుడ్‌కి వెళ్లింది. అక్క‌డ లేటెస్ట్ రైజింగ్ స్టార్ టైగ‌ర్ ష్రాప్‌తో డేటింగ్ మొద‌లుపెట్టింది. అత‌ని కార‌ణంగా తొంద‌ర్లోనే పాపుల‌ర్ అయింది.

మూడేళ్ల పాటు చెట్టాప‌ట్టాలేసుకొని తిర‌గిన టైగ‌ర్‌, ప‌టానీ ఇపుడు బ్రేక‌ప్ చెప్పుకున్నారు. బాలీవుడ్లో మేక‌ప్‌ల క‌న్నా బ్రేక‌ప్‌లే ఎక్కువ‌. వీరి డేటింగ్ కూడా ఎక్కువ కాలం నిల‌వ‌లేదు. ఇపుడు కంప్లీట్‌గా విడిపోయార‌ట‌.

ఐతే ఈ బ్యూటీ కెరియ‌ర్‌కి వ‌చ్చిన న‌ష్టం ఏమీ లేదులెండి. ఇప్ప‌టికే ఈ భామ బాలీవుడ్‌లో స్థిర‌ప‌డిపోయింది. మొన్నామ‌ధ్య స‌ల్మాన్‌ఖాన్ న‌టించిన భ‌ర‌త్‌లో కీల‌క పాత్ర పోషించింది. ఒక పాట‌లో డ్యాన్స్ చేసింది. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్ చేసే బికినీ ఫోటోలు, లింజ‌రీ ఫోటోలు ఒక సెన్సేష‌న్‌. వీటి వ‌ల్లే ఆమెకి మిలియ‌న్లీ కొద్దీ ఫాలోవ‌ర్స్ ఉన్నారు.