అల్లు అర్జున్ సినిమాపై ఎన్నో డౌట్స్

Doubts cast on Allu Arjun's Icon
Saturday, October 19, 2019 - 16:45

ఈ ఏడాది అల్లు అర్జున్ మూడు సినిమాలు ప్రకటించాడు. అందులో ఒకటి ఎండింగ్ కి వచ్చింది. అదే.. త్రివిక్రమ్ తీస్తున్న 'అల వైకుంఠపురంలో'. ఈ సినిమాతో పాటు సుకుమార్ డైరక్షన్లో ఒకటి, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో మరోటి చేస్తానని చెప్పాడు. 'ఐకాన్' పేరుతో వేణు శ్రీరామ్ తీయనున్న సినిమా ఇప్పుడు ఆగిపోయింది అని రూమర్ వైరల్ అవుతోంది. 

సుకుమార్ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరిలో మొదలు పెడితే ...పూర్తయ్యేసరికి ఎనిమిది, పది నెలలు పడుతుంది. ఆ తర్వాత అయినా స్టార్ట్ చేస్తాడా లేక ఎవరైనా పెద్ద దర్శకుడు కథ చెప్తే వెంటనే ఒకే అంటాడా అన్నది చర్చ. అందుకే 'ఐకాన్' సినిమాని ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లే భావించాలి. 

త్రివిక్రమ్ తీస్తున్న 'అల వైకుంఠపురంలో' జనవరి 12న రిలీజ్ కానుంది. ఈ ఏడాది ఒక్క సినిమా రిలీజ్ చేయలేకపోతున్న బన్నీ వచ్చే ఏడాది మాతం రెండు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు. సుకుమార్ సినిమా కూడా నెక్స్ట్ దసరాకి వచ్చేలా చూసుకుంటాడట.