ఈ సిరీస్ లో ఇషా రెచ్చిపోనుందా?

Eesha Rebba to do steamy scenes in Love Stories
Saturday, November 2, 2019 - 11:00

లస్ట్ స్టోరీస్ తరహాలో తెలుగులో లవ్ స్టోరీస్ రూపొందుతోంది. హిందీలో నలుగురు దర్శకులు 'లస్ట్ స్టోరీస్' పేరుతో నెట్ ఫ్లిక్స్ కోసం ఒక అడల్ట్ వెబ్ సిరీస్ తీశారు. అందులో కియారా అద్వానీ ఒక స్కీన్ లో హస్త ప్రయోగం చేసుకునే సీన్లో నటించింది. అది సంచలనం సృష్టించింది. ఇప్పుడు తెలుగులో లవ్ స్టోరీస్ పేరుతో అలాంటి ప్రయోగమే చేస్తోంది నెట్ ఫ్లిక్స్. 

అయితే తెలుగులో లస్ట్ అంటే కామం ఉండదు. ప్రేమ మాత్రమే ఉంటుంది. అయితే  ప్రేమలో డోస్ మాత్రం ఎక్కువే ఉంటుందట. ముద్దులు, హుగ్గులు..ఇంకా మరిన్ని కొంత మోతాదు మించుతుంది. 

ఒక ఎపిసోడ్ లో ఇషా రెబ్బ నటించనుంది. ఈ ఎపిసోడ్ ని  ఘాజి  దర్శకుడు సంకల్ప్ రెడ్డి తీస్తాడు.  ఈ స్టోరీలోనే ఇషా రెచ్చిపోతుంది  అనేది టాక్.