కేరళలో 'ఎంత మంచివాడవురా'

Entha Manchivaadavura heads Kerala
Saturday, October 26, 2019 - 12:45

నందమూరి కల్యాణ్‌రామ్‌, మెహరీన్‌ జంటగా రూపొందుతోన్న చిత్రం 'ఎంత మంచివాడవురా'. ఈ సినిమా షూటింగ్ చివరి దశకి చేరుకొంది. ఆదిత్యా మ్యూజిక్‌ సంస్థ నిర్మిస్తోన్న ఫస్ట్ మూవీ ఇది. 

 "కల్యాణ్‌రామ్‌ - స‌తీశ్ వేగేశ్న‌ కాంబినేషన్ లో మంచి వేల్యూ బుల్  సినిమా తీస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది . ఇక ఆఖరి షెడ్యూల్‌ని కేరళలోని మున్నార్‌ తదితర  సుందరమైన ప్రదేశాల్లో ఈ నెల 31 నుంచి నవంబర్‌ 10 వరకూ షూట్‌ చేయనున్నాం. అక్కడ రెండు పాటలు, కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తాం. కల్యాణ్‌రామ్‌, మెహరీన్‌పై రాజు సుందరం నృత్య దర్శకత్వంలో ఒక పాటను,కల్యాణ్‌రామ్‌, మెహరీస్‌, సుహాసిని, శరత్‌బాబు, వెన్నెల కిశోర్‌ తదితరులపై రఘు మాస్టర్‌ నృత్య దర్శకత్వంలో మరో పాటను షూట్‌ చేస్తాం. జనవరి 15న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం,"  అని తెలిపారు నిర్మాతలు 'ఆదిత్యా' ఉమేష్‌ గుప్తా, శివలెంక కృష్ణ ప్రసాద్‌. 

 "క‌ల్యాణ్ రామ్‌ని స‌రికొత్త డైమ‌న్ష‌న్‌లో చూపించే చిత్ర‌మిది. వ‌చ్చే సంక్రాంతికి త‌గ్గ‌ట్లు ఉండే చిత్రం ఇది," అన్నారు ద‌ర్శ‌కుడు స‌తీశ్ వేగేశ్న.