సూప‌ర్ డేట్ ద‌క్కించుకున్న ఎవ‌రు

Evaru for Independence Day release
Tuesday, July 16, 2019 - 20:30

సాహో సినిమా వాయిదా ప‌డింది. దాంతో ఆగ‌స్ట్ 15 అనే డేట్‌ని మిస్ చేసుకోవ‌ద్ద‌నే ఉద్దేశంతో రెండు సినిమాలు ట‌క్కున కర్చీఫ్ వేశాయి. ఆగ‌స్ట్ 2న రావాల్సిన ర‌ణ‌రంగం త‌న తేదీని ఆగ‌స్ట్ 15కి మార్చుకోగా, ఆగ‌స్ట్ 23న రావాల్సిన ఎవ‌రు కూడా పంద్రాగ‌స్ట్‌కే వ‌స్తోంది. 

`క్ష‌ణం`, `అమీ తుమీ`, `గూఢ‌చారి` వంటి వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న  అడివి శేషు క‌థానాయ‌కుడుగా రూపొందిన మూవీ...`ఎవ‌రు`. వెంక‌ట్ రామ్‌జీ ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. పీవీపీ సంస్థ నిర్మిస్తోంది.  రెజీనాహీరోయిన్‌గా న‌టిస్తుంది. న‌వీన్ చంద్ర కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.

అడివి శేషుకి ఇలా ల‌క్ క‌లిసి వ‌చ్చింది. ఆగ‌స్ట్ 15న హాలీడే.. మంచి పీరియ‌డ్‌. సో..ఓపెనింగ్స్ బాగా వ‌స్తే చాలు సినిమాకి పెట్టిన పెట్టుబ‌డి వ‌చ్చేస్తుంది. మ‌రోవైపు, ఈ సినిమాని ఓవ‌ర్సీస్‌కి 1.30 కోట్ల రూపాయ‌లు పెట్టి కొన్నారు బ‌య్య‌ర్లు.