సైరాపై ఫ‌ర్హ‌న్ అక్త‌ర్‌కి అంత నమ్మ‌క‌మా

Excel movie bags Sye Raa
Monday, May 27, 2019 - 10:15

"సైరా" సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కి చేరుకొంది. మొన్న‌టి వ‌ర‌కు హిందీ బిజినెస్ కావ‌డం లేద‌ని టీమ్ వ‌ర్రీ అయింది. ఐతే ఇపుడు ఖుషీగా ఉంది చిరు అండ్ చ‌ర‌ణ్ టీమ్‌. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ఆయ‌న కొడుకు రామ్‌చ‌ర‌ణ్ నిర్మిస్తున్న మూవీ...సైరా. ఉయ్యాల‌వాడ న‌ర్సింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాకి సురేంద‌ర్‌రెడ్డి డైర‌క్ట‌ర్‌. 

బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, నయనతార, విజయ్‌ సేతుపతి, సుదీప్‌, త‌మ‌న్న న‌టిస్తున్న ఈ సినిమా హిందీ హ‌క్కులు ఇపుడు భారీ మొత్తానికి అమ్ముడుపోయాయ‌ట‌. ఈ మూవీ హిందీ రైట్స్‌ని ఎక్సెల్‌ సంస్థ భారీగా చెల్లించి తీసుకొంద‌ట‌.. ఈ మధ్యే "కేజీఎఫ్‌"ను హిందీలో రిలీజ్‌ చేసి మంచి లాభాలను సొంతం చేసుకున్న ఈ సంస్థ తాజాగా సైరా హక్కులను తీసుకోవ‌డం విశేష‌మే.

ఫ‌ర్హ‌న్ అక్త‌ర్‌కి చెందిన సంస్థ ఇది. మ‌రి ఆయ‌న‌కి ఈ సినిమా అంత న‌మ్మ‌క‌మెందుకో? బ‌హుశా సినిమా కొంత భాగం చూసి శాటిస్‌ఫై అయి ఉంటాడు. కేజీఎఫ్‌ని కూడా కొంత అలా చూసి తీసుకున్నాడు.