విన‌యం కాదు విధ్వంస‌మే

Excessive violence in Vinaya Vidheya Rama
Friday, January 4, 2019 - 15:30

విన‌య విధేయ రామ సినిమా ఫంక్ష‌న్‌కి అతిథిగా వ‌చ్చిన కేటీఆర్ ట్ర‌యిల‌ర్ చూసి ఓ మాట అన్నాడు. టైటిల్‌లో విన‌య విధేయ రామ ఉంది కానీ నాకు విధ్వంస రాముడే క‌న‌ప‌డుతున్నాడ‌ని కేటీఆర్ కామెంట్ చేశాడు. కేటీఆర్ మాట నిజ‌మవుతోంది. సినిమాలో వ‌య‌లెన్స్ ఎక్కువే ఉంద‌ట‌. రామ్‌చ‌ర‌ణ్ యాక్ష‌న్ స్టార్‌గా రెచ్చిపోయాడ‌ట‌. క్ల‌యిమాక్స్ ఫైట్‌లో మొత్తం విధ్యంస‌మే అని టాక్‌.

జ‌న‌ర‌ల్‌గా బోయ‌పాటి సినిమాల్లో హింస అధికంగానే ఉంటుంది. ఐతే రీసెంట్‌గా వ‌యెలెన్స్‌కి, ఫ్యామిలీ రిలేష‌న్స్‌ని మిక్స్ చేస్తూ కొంత బ్యాలెన్స్ చేస్తున్నాడు. టైటిల్స్ కూడా లెంగ్తీగా, పోయెటిక్‌గా పెడుతున్నాడు. జ‌యజాన‌కీ నాయ‌క, విన‌య విధేయ రామ‌..ఇలా అన్న‌మాట‌.

ప్యాకేజింగ్ మారినా..లోప‌ల ఉన్న‌ది మార‌దు క‌దా. అలాగే బోయ‌పాటి ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్‌ని రావ‌ణుడ్ని చీల్చిచెండాడే విధ్యంస‌రాముడిగానే చూపించాడ‌ట‌.