17 అంటే మంచి రేటింగే

F2 Gets good TV ratings on premiere
Thursday, April 18, 2019 - 15:45

"ఎఫ్ 2" సినిమా ఈ ఏడాది విడుద‌లైన సినిమాల్లో అతిపెద్ద హిట్‌. విక్ట‌రీ వెంక‌టేష్ కెరియ‌ర్‌కి మ‌ళ్లీ ఊపు తీసుకొచ్చిన సినిమా ఇది. ఫ్యామిలీ ఆడియెన్స్ తెగ చూసి ఎంజాయ్ చేశారు. అంత పెద్ద హిట్ట‌యిన ఈ సినిమా 50 రోజుల‌కే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అయింది. ఒకవైపు థియేట‌ర్ల‌లో ర‌న్ అవుతుండ‌గానే డిజిట‌ల్ స్ట్రీమింగ్‌లోకి వ‌చ్చింది. 

గ‌త వారం టీవీ తెర‌పై ద‌ర్శ‌న‌మిచ్చింది. ఈ సినిమాకి టీవీల్లోనూ గ‌ట్టి రేటింగే వ‌చ్చింది. 17 రేటింగ్ పాయింట్లు వ‌చ్చాయి. అంటే చాలా ఎక్కువ మంది జ‌నం చూశారు. డిజిటిల్లో దొర‌కుతున్న‌ప్పుడు కూడా 17 పాయింట్లు అంటే సూప‌ర్ రేటింగ్ అని చెప్పాలి. 

వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ హీరోలుగా, త‌మ‌న్న‌, మెహ్రీన్ హీరోయిన్లుగా రూపొందిన ఈ సినిమాని దిల్‌రాజు నిర్మించారు. అనిల్ రావిపూడి డైర‌క్ట్ చేశాడు. ఫుల్ లెంగ్త్ కామెడీతో తెర‌కెక్కింది. సంక్రాంతి పండుగ‌కి విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది.