బాబు అది ఫేక్.. ట్రెండింగ్ ఆపండి

Fake account gets trending about Prabhas next movie
Friday, March 20, 2020 - 18:30

సోషల్ మీడియాలో ఒక్కోసారి గుడ్డెద్దు చేనులో పడినట్టు ఉంటుంది వ్యవహారం. ఎవరో ఏదో స్టార్ట్ చేస్తారు. అందులో విశ్వసనీయత ఎంత అనే చిన్న విషయాన్ని కూడా ఆలోచించకుండా.. అంతా దాన్ని ట్రెండ్ చేసి పడేస్తుంటారు. మొన్నటికిమొన్న ప్రభాస్ సినిమా విషయంలో దర్శకుడు రాధాకృష్ణకుమార్ పేరిట ఉన్న ఏదో నకిలీ ఎకౌంట్, అందులో పెట్టిన పోస్ట్ ట్రెండ్ అయింది. ఇప్పుడు మరోసారి ప్రభాస్ సినిమానే ఇలా ఫేక్ ట్రెండ్ గా మారింది.

త్వరలోనే నాగఅశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు ప్రభాస్. పాన్-వరల్డ్ మూవీగా రాబోతున్న ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశామని, ఆ టైటిల్ ను ఉగాది రోజున రిలీజ్ చేస్తామంటూ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ పేరిట ట్విట్టర్ లో పోస్ట్ పడింది. అంతే.. ప్రభాస్ ఫ్యాన్స్ అంతా పొలోమంటూ ఆ ట్వీట్ ను రీట్వీట్స్ తో నింపేశారు. కామెంట్స్ తో ట్రెండ్ చేశారు.

కట్ చేస్తే, అదసలు వైజయంతీ మూవీస్ అధికారి ఖాతానే కాదు. ఎవరో ఆకతాయి కావాలనే వైజయంతీ మూవీస్ లుక్ తో ఓ నకిలీ ఎకౌంట్ తెరిచి, అందులో ఫస్ట్ లుక్ ఉగాదికి రిలీజ్ చేస్తున్నామంటూ పోస్ట్ పెట్టాడు. అందులో విశ్వసనీయతను చెక్ చేసుకోకుండా.. చాలామంది ప్రభాస్ ఫ్యాన్స్ నిన్నట్నుంచి దాన్ని వైరల్ చేసేస్తున్నారు.