బోటికూర కోసం లొల్లి!

Falaknuma Das trailer has got it right
Monday, May 13, 2019 - 09:00

తెలంగాణ యాస‌లోనే కొంత వైవిధ్యంగా క‌నిపించే యాస‌..హైద‌రాబాదీ లోక‌ల్ యాస‌. ముషీరాబాద్‌, గాంధీన‌గ‌ర్‌, మ‌ల‌క్‌పేట్‌, యూస‌ఫ్‌గూడ‌ గ‌ల్లీల్లో వెళ్తే మీరు వినొచ్చు లోక‌ల్ కుర్రాళ్ల పెక్యుల‌ర్ యాస‌. "ఫ‌ల‌క్‌నుమా దాస్‌"లో అదే చూపిస్తున్న‌ట్లుంది.

అంగ‌మ‌లీ డైరీస్ అనే మ‌ల‌యాళ చిత్రానికిది రీమేక్. కోచ్చికి స‌బ‌ర్బ‌న్ ప్రాంతం...అంగ‌మ‌లీ. అక్క‌డిక‌ల్చ‌ర్‌, ఆ భాష‌, అక్క‌డి తిండి (పంది కూర మెయిన్ ఆహారం), అక్క‌డి గొడ‌వ‌ల‌పై ప్ర‌ధానంగా ఫోక‌స్ పెట్టి తీసిన సినిమా అది. దాన్ని విశ్వ‌క్ సేన్ (అత‌నే హీరో, అత‌నే ద‌ర్శ‌కుడు) తెలుగులో రీమేక్ చేశాడు.  అంగ‌మ‌లీ ..ఫ‌ల‌క్‌నుమాగా మారింది. ఆ సినిమాలో పంది మాంసం వ్యాపారం అది ఇక్క‌డ‌ మ‌ట‌న్ వ్యాపారంగా మారింది. బోటికూర గురించి గొడ‌వ మొద‌ల‌వ‌డం వంటివి ఈ సినిమాలో క‌నిపిస్తాయి. 

ఇక స్ట్రీట్ లాంగ్వేజ్ ఫుల్లుగా ట్ర‌యిల‌ర్‌లో వినిపించాయి. సినిమాలో ఎంత వ‌ర‌కు ఉంటాయో...సెన్సార్ ఎంత‌వ‌ర‌కు అంగీక‌రిస్తుందో చూడాలి. యూత్‌కి న‌చ్చేవిధంగా ట్ర‌యిల‌ర్‌ని క‌ట్‌చేశారు.