మంచు లక్ష్మీ కొత్త టాక్‌ షో

Feet Up with the Stars with Lakshmi Manchu
Monday, September 16, 2019 - 19:15

కొంత కాలంగా మంచు లక్ష్మీ సందడి తగ్గింది. సినిమాల్లో కూడా చాలా తక్కువగా కనిపిస్తోంది. ఐతే, ఆమె గ్లామర్‌ ప్రపంచానికి దూరంగా ఉంటుందేమో అనుకుంటే పొరపాటే. మంచు లక్ష్మీ తన కెరియర్‌ని టాక్‌ షోతో ప్రారంభించింది. మళ్లీ ఇపుడు అదే పని చేస్తోంది. ఇపుడు కొత్త కాన్సెప్ట్‌తో, కొత్త అవతారంలో రానుంది. ఈసారి హీరోల, హీరోయిన్ల బెడ్‌రూంల వరకు వెళ్లనుంది ఆమె టాక్‌ షో.  ఈ షో పేరు.. Feet Up with the Stars.

సెలబ్రిటీలు.. బెడ్ పైకి చేరిన తర్వాత వాళ్ల ఆలోచనా విధానం ఎలా ఉంటుంది. ఆ రోజంతా వారికి ఎలా గడిచింది.. ఇలాంటి అంశాలతో పాటు.. ఇప్పటి వరకూ ఎవరికీ చెప్పని, తెలియని విషయాలను కూడా తెలసుకోవాలనుకునే అభిమానులు చాలానే ఉంటారు. అలాంటి వారికోసం బాలీవుడ్ లో ఓ క్రేజీ షో వస్తోంది. .ఇప్పుడు తెలుగులో ఆ షోని లక్ష్మీ చేస్తోంది. ఈ షో త్వరలోనే తెలుగులో
ప్రసారం కాబోతోంది. ఈ నెల 23 నుంచి ప్రారంభం కాబోతోన్న ఈ షోకోసం ఇప్పటికే పలువురు హీరోలు, హీరోయిన్లను ఇంటర్వ్యూ చేసింది లక్ష్మీ.

ఇది వెబ్‌ సిరీస్‌.