మణిరత్నంపై దేశద్రోహం కేసు

FIR against Mani Ratnam
Friday, October 4, 2019 - 18:45

ప్రముఖ దర్శకుడు మణిరత్నంపై దేశద్రోహం కేసు బుక్ అయింది. ఇటీవల దాదాపు 50 మంది ప్రముఖులు ప్రధాని మోడీకి...దేశంలో లించింగ్స్ ఆపేలా మీరు కలగచేసుకోవాలని లేక రాశారు. దళితులు, మైనారిటీలపై దాడులు, మూక ఉన్మాద దాడులు పెరగడం కలవర పెడుతోంది అంటూ వీరంతా లెటర్ రాశారు. ఇలా లేఖ రాసి దేశ ప్రతిష్టకే  భంగం కలిగించారని కోర్టును అప్రోచ్ అయ్యారు కొందరు. ఈ కేసు స్వీకరించిన బీహార్ కోర్ట్ ఈ ప్రముఖలందరిపై దేశద్రోహం కింద FIR రిజిస్టర్ చెయ్యమని పోలీసులని ఆదేశించింది..

రోజా, బొంబాయి సినిమాలు తీసిన టైంలో మణిరత్నం ...హిందుత్వ వాది అనే ఆరోపణలు ఎదురుకున్నారు ఇప్పుడు అర్బన్ నక్సల్ అంటూ బీజేపీ గగ్గోలు పెడుతోంది. 

మణిరత్నం ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ అనే సినిమా తీస్తున్నారు. ఈ చారిత్రక చిత్రంలో ఐశ్వర్య, విక్రమ్, కార్తీ, అమితాబ్, మోహన్ బాబు, తదితరులు నటిస్తున్నారు. దాదాపు 200 కోట్లతో ఐదు భాషల్లో తీయనున్నారట.