సమంత, చైతూల ఫ్లాష్ బ్యాక్

Flashback stills of Majili
Friday, March 15, 2019 - 18:30

మజిలీ సినిమాలో జంటగా నటించారు రియల్ లైఫ్‌లో భార్యభర్తలైన చైతన్య, సమంత. పెళ్లి తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో తొలి సినిమా ఇది. మజిలీ సినిమాకి సంబంధించిన కొన్ని కొత్త ఫోటోలను తాజాగా విడుదల చేశారు.

ఈ ఫోటోలను బట్టి చూస్తే.... సమంత, చైతన్యల ఫ్లాష్ బ్యాక్ ట్రాక్ సినిమా కథలో కీరోల్ ప్లే చేస్తుందని అర్ధమవుతోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన మజిలీ వైజాగ్ బ్యాక్ డ్రాప్‌లో సాగుతుంది. 1990లకి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ కొంత ఉంటుందట. పాతకాలపు సైకిళ్లు, వైజాగ్ పాతకాలపు సందులు...అవి ఈ సినిమాలో మనం చూడొచ్చు. సమత, చైతన్య కూడా రెండు రకాల గెట‌ప్‌లో దర్శనమిస్తారట.

ఏప్రిల్ 5న రానున్న మజిలీ పాటలు ఇంకా అంతగా క్లిక్ కాలేదు. జ‌నంలో ఇంకా నానాలి. ఐతే సినిమా మాత్రం మంచి బ‌జ్‌ని తెచ్చుకొంది. బిజినెస్ కూడా బాగా జ‌రుగుతోంది.