మ‌హ‌ర్షి నాలుగో పాట‌కి రెస్పాన్స్‌

Fourth song from Maharshi gets good response.
Wednesday, April 24, 2019 - 23:15

ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన "మ‌హ‌ర్షి" సినిమా పాట‌లేవీ అటు మ‌హేష్‌బాబు అభిమానుల‌ని కానీ, ఇటు సాధార‌ణ సినిమా ల‌వ‌ర్స్‌ని కానీ ఆక‌ట్టుకోలేక‌పోయాయి. మూడు పాట‌లు సో సోగా అనిపించాయి. దాంతో మ‌హ‌ర్షి సినిమాకి క్రేజ్ రావ‌డం లేద‌నే కామెంట్స్ మొద‌ల‌య్యాయి. అలాంటి టైమ్‌లో నాలుగో పాట‌ని విడుద‌ల చేసింది మ‌హ‌ర్షి టీమ్‌.

"పదరా పదరా పదరా 
ఈ వెలుగు పలుగు దించి పదరా 
పగుళ్లతో పనికి రానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా‌"....  అంటూ శ్రీమ‌ణి రాసిన సిచ్యువేష‌న‌ల్ సాంగ్ ఇది. శంక‌ర్ మ‌హ‌దేవ‌న్ పాడాడు. ఈ పాటకి పాజిటివ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ట్యూన్‌, సాహిత్యం, గాయ‌కుడు... అన్ని ఈ పాట‌కి కుదిరాయి. దాంతో టీమ్ ఊపిరి పీల్చుకొంది. 

దేవీశ్రీప్ర‌సాద్ కొంతకాలంగా కొత్త ట్యూన్లు ఇవ్వ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు ఎక్కువ‌య్యాయి. త‌న పాత బాణీల‌కే కొత్త మేకప్ వేస్తున్నాడ‌ని అంటున్నారు. మ‌హ‌ర్షి సినిమా మే 9న విడుద‌ల కానుంది.