ఫ్లాప్‌తో విద్యు అతికి బ్రేక్‌

Full stop to Vidyu Raman's over action on Twitter?
Friday, August 31, 2018 - 01:15

ఏదో సినిమాలో హే సాంబార్ అంటూ అన్న‌పూర్ణ‌మ్మతో పిలిపించుకునే విద్యుల్లేఖ రామ‌న్‌ ..రియ‌ల్ లైఫ్‌లో నిజంగానే అర‌వ అతిని చూపిస్తుంటుంద‌ట‌. త‌ను న‌టించిన సినిమాల‌కి మంచి రేటింగ్‌లు రాక‌పోతే క్రిటిక్స్‌ని తిట్ట‌డం వంటివి చేస్తుంటుంది. ఐతే ఈ భామ‌కి ఇటీవ‌ల‌ దిమ్మ తిరిగే బొమ్మ క‌నిపించ‌డంతో ఇక అతికి అర్జెంట్‌గా బ్రేక్‌లు వేసింది.

విద్యు రామ‌న్ ఫీమేల్ క‌మెడియ‌న్‌గా, హీరోయిన్ల ఫ్రెండ్ క్యార‌క్ట‌ర్స్‌ల‌లో ఎక్కువ‌గా క‌నిపిస్తుంటుంది. సొంత భాష త‌మిళంలో క‌న్నా తెలుగులోనే విద్యుకి అవ‌కాశాలు ఎక్కువ‌. ఐతే ఈ భామ ఆ మ‌ధ్య "శ్రీనివాస క‌ల్యాణం" విడుద‌ల టైమ్‌లో చాలా ఓవ‌ర్ చేసింది. డ్యాం ది క్రిటిక్స్ అంటూ.. విమ‌ర్శ‌కుల‌ను దారుణంగా కామెంట్ చేసింది. క్రిటిక్స్ మెచ్చుకుంటే ఎంటి లేక‌పోతే ఏంటి..జ‌నం మెచ్చుకుంటున్నారు..అంటూ ఒక మూడు, నాలుగు రోజులు నానా హంగామా చేసింది.

ట్విట్ట‌ర్‌లో సెల‌బ్రిటీల నుంచి రీట్వీట్‌ల కోసం ప‌డే పొగ‌డ్త‌ల‌ను నిజ‌మ‌ని భ్ర‌మ‌ప‌డింది. కానీ నిర్మాత దిల్‌రాజుకి లాగే ఈ భామ‌కి కూడా వారం త‌ర్వాత అస‌లు సినిమా క‌న‌ప‌డింది. అప్ప‌ట్నుంచి ట్విట్‌ల అతిచేష్ట‌లు బంద్ చేసింది. బుద్దిగా ట్వీట్లు వేస్తోంది. అస‌లు బొమ్మ క‌న‌ప‌డితే కానీ వాస్త‌వంలోకి రారు కొంద‌రు సెల‌బ్రిటీలు.