లోకేష్ కోసం మ‌హేష్‌బాబు సిస్ట‌ర్ ప్ర‌చారం

Galla Padmavathi campaigns for Nara Lokesh
Saturday, March 16, 2019 - 19:00

సూప‌ర్‌స్టార్ కృష్ణ కూతురు, మ‌హేష్‌బాబు సోద‌రి ప‌ద్మావ‌తి... తెలుగుదేశం ఐటి మంత్రి నారా లోకేష్ త‌ర‌ఫున ప్ర‌చారం చేస్తున్నారు. లోకేష్ మంగ‌ళ‌గిరి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీలో ఉన్నారు. ప‌ద్మావ‌తి గ‌ల్లా జ‌య‌దేవ్ భార్య‌. ఆమె భ‌ర్త గుంటూరు ఎంపీ. అందుకే ఆమె త‌న భ‌ర్త కోసం ప్ర‌చారంలో పాల్గొంటున్నారు. అలాగే మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో లోకేష్ ప్రచారంలో పాల్గొంటున్నారు గల్లా పద్మావతి.

"లోకేష్ మంగళగిరి నియోజకవర్గం ఎంచుకోవడం మా అందరి అదృష్టం. లోకేష్ పెద్ద మెజారిటీ తో గెలవాలని దేవుణ్ణి కోరుకున్నాను. ఎంపీగా గల్లా జయదేవ్... తెలుగువారి వాణిని వినిపించారు. అందుకే ఇటు జ‌య‌దేవ్‌ని ఎంపీగా, లోకేష్‌ని ఎమ్మెల్యేగా ప్ర‌జ‌లు ఓటేసి గెలిపించాల‌ని," ఆమె ప్ర‌చారం చేస్తున్నారు.

మ‌రి మ‌హేష్‌బాబు కూడా ప్ర‌చారంలో పాల్గొంటాడా అని ప్ర‌శ్నిస్తే త‌న సోద‌రుడు రాజ‌కీయాల‌కి దూరంగా ఉంటాడ‌ని స‌మాధానం ఇచ్చింది.