గ్యాంగ్‌లీడర్‌కి 30 కోట్ల రికవరీ సాధ్యమేనా

Gang Leader does Rs 30 Cr pre-release biz
Wednesday, September 11, 2019 - 17:15

నాని మీడియం రేంజ్‌ హీరోల్లో ఫస్ట్‌ప్లేస్‌లో ఉన్నాడు. నేచురల్‌ స్టార్‌ అని పేరు తెచ్చుకున్న నాని రీసెంట్‌గా భారీ హిట్స్‌ అందివ్వలేకపోతున్నాడనేది కూడా వాస్తవమే. జెర్సీకి పేరు వచ్చినంత రేంజ్‌లో కలెక్షన్లు రాలేదన్నది చేదు నిజమే. పెట్టిన పెట్టుబడికి, అమ్మిన దానికి సరిపోయేంతగా వచ్చింది. అంతే. అయినా కూడా ఈ శుక్రవారం విడుదల అవుతోన్న గ్యాంగ్‌లీడర్‌ సినిమాకి దాదాపు 30 కోట్ల రూపాయల ప్రిరిలీజ్‌ బిజినెస్‌ అయిందట. ఇది ఎక్కువ మొత్తమే. కొన్నవారికి గిట్టుబాటు కావాలంటే ఈ సినిమా గట్టిగా ఆడాల్సిందే.

నాని కెరియర్‌లో ఇప్పటి వరకు బిగ్గెస్ట్‌ హిట్‌గా ఎం.సీ.ఏ సినిమా నిలిచింది. మరి గ్యాంగ్‌లీడర్‌తో ఆ మార్క్‌ని దాటుతాడా?

గ్యాంగ్‌లీడర్ సినిమా ఒక క్రైమ్‌ కామెడీ. ఇందులో నాని నవలారచయితగా నటిస్తున్నాడు. క్రైమ్‌ నవలలు రాసుకునే నాని.. ఒక విలన్‌ (కార్తీకేయ) నుంచి అయిదుగురు లేడీస్‌ని ఎలా కాపాడాడు అనేదే సినిమా స్టోరీ. విక్రమ్‌కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన మూవీ ఇది.