ప‌రుశురామ్‌ని ఇరికించిన గీతా

Geetha Arts locks Parusaram
Friday, August 17, 2018 - 19:45

"గీత గోవిందం" సినిమా విజ‌యం మామూలు విజ‌యం కాదు. ఈ ఏడాది అతి పెద్ద హిట్ చిత్రాల్లో ఒక‌టిగా నిలవ‌నుంది. "గీత‌గోవిందం" సినిమాతో విజ‌య్ దేవ‌ర‌కొండ ఒక మెట్టు ఎక్కాడు. విజ‌య్‌తో పాటు ద‌ర్శ‌కుడికి కూడా చాలా పేరు వ‌చ్చింది. ద‌ర్శ‌కుడు పరుశ‌రామ్‌కి అయితే ఆఫ‌ర్ల మీద ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. మిడిల్ రేంజ్ హీరోలంద‌రూ ఫోన్లు చేసి మ‌నం సినిమా చేద్దామ‌ని అంటున్నారు. కొన్ని టెంప్టింగ్ ఆఫ‌ర్లు కూడా ఉన్నాయి. కానీ ప‌రుశ‌రామ్‌ని లాక్ చేశాడు అల్లు అర‌వింద్‌.

నెక్స్ట్ మూవీ కూడా గీతా బ్యాన‌ర్‌లోనే చేయాల‌ని ఒప్పించారు ప‌రుశ‌రామ్‌ని. ఇప్ప‌టికే రెండు సినిమాలు తీశాడు ఆ బ్యాన‌ర్‌లో. "యువ‌త‌", "ఆంజ‌నేయులు", "సోలో", "సారొచ్చారు", "శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు" వంటి సినిమాలు తీసిన ప‌రుశ‌రామ్‌కి త‌న కెరియ‌ర్‌లో ఇదే అతిపెద్ద హిట్‌. అందుకే ఆ కృత‌జ్ఞ‌త‌తో మ‌రో సినిమా గీతా బ్యాన‌ర్‌కి ఓకే చెప్పాడు ప‌రుశ‌రామ్‌.

త‌దుపరి చిత్రం అల్లు అర్జున్‌తో ఉంటుందా లేదా మ‌రో యువ హీరోతో ఉంటుందా అనేది చూడాలి.